Revanth|ఆడుమగాడ్రా అనిపించుకున్న రేవంత్
సెలబ్రిటీలను ఉద్దేశించి, కోట్లలో అభిమానులున్న అల్లు అర్జున్ ను ఉద్దేశించి మనసులోని మాటను నిర్భయంగా చెప్పిన రేవంత్ ను సోషల్ మీడియా(Social Media)లో నెటిజన్లు అభినందిస్తున్నారు.
‘సినీనటులు సైనికులా ? ఇండియా-పాకిస్ధాన్ సరిహద్దుల్లో యుద్ధంచేసి వచ్చారా ?’ ఈ ప్రశ్నవేసింది రేవంత్ రెడ్డి. ప్రశ్నను సంధించింది అల్లు అర్జున్ను ఉద్దేశించి. ప్రశ్నించింది ప్రముఖ జాతీయ ఛానల్ ను. జాతీయ ఛానల్ ఇంటర్వ్యూలో ప్యాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) అరెస్టుపై రేవం(Revanth)త్ రియాక్షన్ ఇపుడు బాగా వైరల్ అవుతోంది. సినీసెలబ్రిటీలను(Cine celebrities) ఉద్దేశించి రేవంత్ ప్రశ్నించినట్లుగా గతంలో ఏ ముఖ్యమంత్రి ప్రశ్నించిన దాఖలాలులేవు. సినిమా తీశారు..డబ్బులు సంపాదించుకుంటున్నారు. దేశంకోసం చేస్తున్నది ఏముంది ? అని ఛానల్ ను నిలదీశారు. సెలబ్రిటీలను ఉద్దేశించి, కోట్లలో అభిమానులున్న అల్లు అర్జున్ ను ఉద్దేశించి మనసులోని మాటను నిర్భయంగా చెప్పిన రేవంత్ ను సోషల్ మీడియా(Social Media)లో నెటిజన్లు అభినందిస్తున్నారు. సెలబ్రిటీల జోలికి ఏ ప్రభుత్వం కూడా వెళ్ళటానికి ఇష్టపడదు. అభిమానులతో గొడవలు ఎందుకని చూసీచూడనట్లు ఉంటుంది. అలాంటిది ఏకంగా ముగ్గురు సెలబ్రిటీల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించటం ఆశ్చర్యంగా ఉంది.
అసలీ చర్చంతా ఎందుకు వచ్చిందంటే ఢిల్లీలో ఒక ఛానల్ రేవంత్ ను ఇంటర్వ్యూచేసింది. ఈ సందర్భంగా అల్లుఅర్జున్ అరెస్టును ప్రస్తావించినపుడు రేవంత్ పై విధంగా స్పందించాడు. పుష్ప2 సినిమా విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన మహిళగురించి ఎవరూ ఎందుకు మాట్లాడటంలేదని రేవంత్ ఛానల్ ప్రతినిధిని ఎదురు ప్రశ్నించాడు. ఒక వ్యక్తిని పోలీసుస్టేషన్ కు తీసుకెళితే ఎందుకు ఇంత చర్చ చేస్తున్నారు అని నిలదీశారు. అల్లు అర్జున్ రాక సందర్భంగానే థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగిందన్నాడు. ఆ తొక్కిసలాటలో మహిళ చనిపోతే పోలీసులు కేసు నమోదుచేసి బాధ్యుడైన అల్లు అర్జున్ ను అరెస్టు చేస్తే ఇంత రచ్చ చేయాలా అని అడిగాడు. పోలీసులు కేసు పెట్టద్దా ? బాధ్యుడిని అరెస్టు చేయకూడదని అందరు అనుకుంటున్నారా ? అని సందేహం వ్యక్తంచేశాడు.
‘కేసుపెట్టకపోతే కేసు పెట్టలేదంటారు, అరెస్టుచేయకపోతే అరెస్టు చేయలేదని మళ్ళీ మీరే అంటారు కదా’ని ఛానల్ ను ఉద్దేశించి రేవంత్ ప్రశ్నించాడు. పోలీసులు కేసుపెట్టి అరెస్టుచేయటంలో తన ప్రమేయం ఏమీ లేదని క్లారిటి ఇచ్చాడు. చట్టం తనపని తాను చేసుకుపోతుందని, మామూలు జనాలకు ఒక చట్టం సినిమావాళ్ళకు మరో చట్టం ఉండదన్నారు. దేశంలోని ఎవరైనా బీఆర్ అంబేద్కర్(BR Ambedkar Constitution) రాజ్యాంగానికి లోబడే పనిచేయాలని చెప్పారు. అల్లు అర్జున్ మేనమామ చిరంజీవి(Chiranjeevi), మామగారు చంద్రశేఖరరెడ్డి ఇద్దరూ కాంగ్రెస్ నేతలే అన్న విషయాన్ని రేవంత్ గుర్తుచేశారు. చుట్టం చుట్టమే..చట్టం చట్టమే అని క్లారిటి ఇచ్చాడు. ఒకపుడు తాను సూపర్ స్టార్ కృష్ణకు అభిమానిని అయినా ఇపుడు తానే ఒక స్టార్ అని, తనకూ అభిమానులు ఉన్నారని సరదాగా వ్యాఖ్యానించారు.
సినిమా విడుదల సందర్భంగా పోలీసులు బెనిఫిట్ షోకు మాత్రమే అనుమతిచ్చారు కాని అల్లు అర్జున్ రోడ్డుషోకు అనుమతి ఇవ్వలేదని రేవంత్ గుర్తుచేశాడు. థియేటర్ దగ్గరకు అర్జున్ ఓపెన్ టాప్ జీపులో చేతులూపుకుంటు రావటంవల్లే థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగిందని, ఆ తొక్కిసలాటలో మహిళ మరణించిందని రేవంత్ గుర్తుచేశాడు. మహిళ మరణిస్తే కేసు ఉండకూడదని, బాధ్యులపై కేసుపెట్టి అరెస్టు చేయకూడదని అంటారా అన్నపుడు ఛానల్ ప్రతినిధి ఏమీ మాట్లాడలేదు. మోహన్ బాబు విషయాన్ని ప్రస్తావిస్తు పోలీసులు కేసు పెట్టారు. విషయం ఇపుడు కోర్టు పరిధిలో ఉందని చెప్పాడు. తప్పు ఎవరు చేసినా చట్టం ఒకే విధంగా వర్తిస్తుందని రేవంత్ స్పష్టంగా చెప్పాడు. ఛానల్ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ పై కేసు, సెలబ్రిటీల విషయంలో వెలిబుచ్చిన అభిప్రాయాలపై సోషల్ మీడియాలో అభినందనలు పెరిగిపోతోంది. అందుకనే రేవంత్ ను ‘ఆడు మగాడ్రా బుజ్జీ’ అన్న డైలాగును జతచేస్తున్నారు నెటిజన్లు.
పోలీసులు అల్లు అర్జున్ అరెస్టుచేసి కోర్టు ద్వారా చంచల్ గూడ్ జైలుకు పంపారు. అంతకుముందే మంచుమోహన్ బాబు((Mohan Babu)పై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదుచేశారు. తండ్రి, కొడుకుల మధ్య గొడవలై వివాదం రోడ్డున పడితే ముందుజాగ్రత్తగా ముగ్గురి రివాల్వార్లను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. అంతకుముందు మరో ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna)కు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్(N Convention Centre) ను హైడ్రా(Hydra) కూల్చేసింది. కన్వెన్షన్ సెంటర్ జోలికి రావద్దని ప్రభుత్వంపై ఎంత ఒత్తిడి వచ్చినా వెనక్కు తగ్గకుండా నాగార్జున ప్రముఖ సెలబ్రిటీ అని కూడా చూడకుండా నిబంధనలు ఉల్లంఘించింది కాబట్టి హైడ్రా కూల్చేసింది. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఫ్యాన్ ఫాలోయింగ్, రాజకీయ మద్దతు, ఆర్ధికంగా అక్కినేని నాగార్జున, మంచు మోహన్ బాబు, అల్లు అర్జున్ ఎవరికి ఎవరూ తీసిపోరు. ముగ్గురూ అత్యంత పవర్ ఫుల్ సెలబ్రిటీలనే చెప్పాలి. అయినా సరే పై ముగ్గురిపైన యాక్షన్ తీసుకోవటంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. అందుకనే రేవంత్ ను నెటిజన్లు, అభిమానులు ఆడుమగాడ్రా బుజ్జీ అంటున్నది.