ఫోర్త్ సిటీలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ?
వరల్డ్ ట్రేడ్ సెంటర్ సుమారు 100 ఎకరాల్లో కోటి చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటయ్యే అవకాశముందని సమాచారం.
రేవంత్ చాలా పెద్ద ప్లానింగులోనే ఉన్నారు. కొద్దిరోజులుగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఫ్యూచర్ సిటి (ఫోర్త్ సిటీ)ని ఏర్పాటు చేయాలన్న ఆలోచనను పదేపదే షేర్ చేసుకుంటున్నారు. వేదిక ఏదైనా సరే ఫోర్త్ సిటీ గురించి రేవంత్ తప్పకుండా ప్రస్తావిస్తున్నారు. ఇంతకీ రేవంత్ ప్రపోజ్ చేస్తున్న ఫోర్త్ సిటీ ఎక్కడ వస్తుంది ? ఎన్ని ఎకరాల్లో ఏర్పాటవుతుంది ? దీనికి ఉన్న ప్రాధాన్యత ఏమిటి ? అనే విషయాలపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ నేపధ్యంలోనే తాజాగా వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిర్మాణం కూడా జరగబోతోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ఇంతకీ విషయం ఏమిటంటే రేవంత్ చెబుతున్న ఫోర్త్ సిటీ చేవెళ్ళ-కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో వస్తుంది. పై రెండు నియోజకవర్గాల్లో ముచ్చర్ల అనే ఊరుంది. ముచ్చర్లలోనే సుమారు 25 వేల ఎకరాల్లో ఫోర్త్ సిటీని ఏర్పాటు చేయాలన్నది రేవంత్ ఆలోచన. ఇందులోనే స్పోర్ట్స్ యూనివర్సిటి, స్కిల్ యూనివర్సిటీ, ఏఐ సెంటీ, ఫార్మా సిటీ లాంటి అత్యంత అధునాత సిటీలన్నీ ఏర్పాటు అవబోతున్నాయి. ఇన్ని సీటీలను ఏర్పాటు చేయాలన్న ఆలోచేన ఉంది కాబట్టే ఈ ప్రాంతాన్ని రేవంత్ ఫోర్త్ సిటీగా పిలుస్తున్నారు. ఇలాంటి ఫోర్త్ సిటీలోనే వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఏర్పాటుకు ప్లన్ చేయాలని ఉన్నతాదికారులను ఆదేశించారు. ఈ ట్రేడ్ సెంటర్లో ప్రపంచ వాణిజ్య సంస్ధలన్నీ తమ కార్యాలయాలను ఏర్పాటుచేసుకునేందుకు ఆహ్వానించాలని రేవంత్ ప్లాన్ చేస్తున్నారు.
వరల్డ్ ట్రేడ్ సెంటర్ పేరుతో ట్రేడ్ సెంటర్లను ఎవరు పడితే వాళ్ళు ఏర్పాటు చేసుకునేందుకు లేదు. న్యూయార్క్ లోని వరల్డ్ ట్రేడ్ సెంట అసోసియేషన్ కు మాత్రమే ప్రపంచంలోని ఇతర దేశాల్లో ట్రేడ్ సెంటర్లను ఏర్పాటు చేసే అవకాశముంది. అందుకనే వరల్డ్ ట్రేడ్ సెంటర్ అసోసియేషన్ ముఖ్యులతో ఉన్నతాధికారులు సంపద్రింపులు జరిపారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఏర్పాటవ్వాలంటే ఎంత భూమి ఉండాలి ? కల్పించాల్సిన మౌళిక సదుపాయాలు ఏమిటి ? ఎన్ని అంతస్తుల వరకు నిర్మించవచ్చు ? వెహికల్ పార్కింగ్, సెక్యూరిటి, ఫుడ్ కోర్టులు, మల్టీప్లెక్సుల్లాంటి అన్నీ విషయాలపైనా ఉన్నతాధికారులు ట్రేడ్ సెంటర్ అసోసియేషన్ ముఖ్యులతో మాట్లాడి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఏర్పాటుకు అవసరమైన స్ధలాన్ని ఉన్నతాధికారులు ముచ్చర్లలో పరిశీలించారు.
ఎలాగూ ఫోర్త్ సిటీని అంతర్జాతీయ విమనాశ్రయం శంషాబాద్ కు దగ్గర్లోనే ఏర్పాటు చేయబోతున్నారు. కాబట్టి రోడ్డు, మెట్రో కనెక్టివిటీని కూడా సిద్ధం చేస్తున్నారు. ఫోర్త్ సిటీలోని అన్నీ నిర్మాణాలకు వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిర్మాణం ఐకానిక్కుగా నిలబడాలని రేవంత్ పట్టుదలగా ఉన్నారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ సుమారు 100 ఎకరాల్లో కోటి చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటయ్యే అవకాశముందని సమాచారం. ఈ సెంటర్ కోసం భారీ సోలార్ పవర్ ప్లాంట్లు, అత్యాధునిక కమ్యూనికేషన్ వ్యవస్ధ ఏర్పాటుకు ప్లాన్ జరుగుతోంది. అనుకున్నది అనుకున్న ప్లానింగ్ అనుకున్నట్లు జరిగితే 2025-26కి మొదటి దశ నిర్మాణం పూర్తవుతుంది.
జరుగుతున్న ప్లానింగ్ ప్రకారం ఫోర్త్ సిటీ నిర్మాణం పనులు మొదలైతే, ఇందులోనే వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిర్మాణానికి శ్రీకారం చుడితే రేవంత్ ఇమేజి మామూలుగా ఉండదు. ఆకాశమంత ఎత్తుకు రేవంత్ ఇమేజి పెరిగిపోవటం ఖాయం. అనుకున్నది అనుకున్నట్లుగా పోర్త సిటీ ఏర్పాటై అందులో వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిర్మాణం కూడా పూర్తయితే అభివృద్ధి విషయంలో రేవంత్ పేరు చిరస్ధాయిగా ఉండిపోతుందనటంలో ఎలాంటి సందేహంలేదు.