
ఉపఎన్నికల ప్రచారాన్ని కొట్టేసిన రేవంత్
తొందరలోనే పదిఅసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు వస్తాయని పదేపదే చెబుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆశలపై రేవంత్ రెడ్డి నీళ్ళు చల్లేశారు
తొందరలోనే పదిఅసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు వస్తాయని పదేపదే చెబుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆశలపై రేవంత్ రెడ్డి నీళ్ళు చల్లేశారు. అసెంబ్లీలో బుధవారం మాట్లాడుతు చట్టం, రాజ్యాంగం మారనపుడు తెలంగాణలో ఉపఎన్నికలు ఎలాగ వస్తాయని రేవంత్(Revanth) ప్రశ్నించారు. ఫిరాయింపులపై అసెంబ్లీలో వచ్చిన ప్రస్తావనకు రేవంత్ వివరణిచ్చారు. ఈసందర్భంగా మాట్లాడుతు ఫిరాయింపుల విషయంలో చట్టంలో సరైన వివరణ లేదా నిర్వచనం లేనపుడు అందుబాటులో ఉన్న సంప్రదాయాలను అనుసరించాల్సుంటుందన్నారు.
ఫిరాయింపుల విషయంలో గతప్రభుత్వం అనుసరించిన విధానాలనే ఇపుడు తాముకూడా అనుసరిస్తున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్(BRS MLAs) Defections ప్రభుత్వం 2014-18, 2018-23 మధ్య ఫిరాయింపుల విషయంలో ఎలాంటి వైఖరి అనుసరించిందో తాము కూడా అదే వైఖరిని అనుసరిస్తున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో ఎంఎల్ఏల ఫిరాయింపులు జరిగినపుడు ఏ నియోజకవర్గంలో కూడా ఉపఎన్నికలు రాలేదన్న విషయాన్ని రేవంత్ గుర్తుచేశారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫిరాయింపుల విషయంలో ఉపఎన్నికలు రానపుడు తమహయాంలో మాత్రం ఉపఎన్నికలు ఎందుకు వస్తాయని రేవంత్ ప్రశ్నించారు. ఫిరాయింపుల అంశం సుప్రింకోర్టు విచారణలో ఉన్నా సబ్జెక్టు మీద అసెంబ్లీలో చర్చ జరగటంలో తప్పులేదన్నారు.
ఫిరాయింపుల నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు వస్తాయని ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ అపోహమాత్రమే అని తేల్చేశారు. ఉపఎన్నికలు వస్తాయని ఎవరూ ఆశలు పెట్టుకోవద్దని రేవంత్ స్పష్టంగా ప్రకటించారు. మంగళవారం సుప్రింకోర్టులో ఫిరాయింపుల విషయంలో జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ చేసిన వ్యాఖ్యలతో రేవంత్ కు ధైర్యం వచ్చినట్లుంది. అందుకనే ఫిరాయింపుల నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు రావని అసెంబ్లీలోనే ధైర్యంగా ప్రకటించారు.