చంద్రబాబుకే రేవంత్ టెండర్ పెడుతున్నారా ?
x

చంద్రబాబుకే రేవంత్ టెండర్ పెడుతున్నారా ?

హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టమని రేవంత్ కమ్మసామాజికవర్గంలోని పారిశ్రామికవేత్తలను అడిగారు.


ఏ రాష్ట్రం డెవలప్ అవ్వాలన్నా పరిశ్రమలు ఎంతో అవసరం. పరిశ్రమలకు పెట్టుబడులు చాలా కీలకం. పెట్టుబడులు రావాలంటే పారిశ్రామికవేత్తలను ఆకర్షించటం చాలా ముఖ్యం. ఇపుడు రేవంత్ ఇదే పనిచేస్తున్నారు. రెండురోజుల కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ (కేజీఎఫ్) సమ్మిట్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమ్మిట్ ఆదివారం రాత్రితో ముగుస్తుంది. ఈ సమ్మిట్ లో పాల్గొనేందుకు దేశ, విదేశాల నుండి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. ముఖ్య అతిధిగా రెండు రోజుల సమ్మిట్ ను ప్రారంభించిన రేవంత్ రెడ్డి మాట్లాడుతు హైదరాబాద్ మహానగరాన్ని విశ్వనగరంగా మార్చటంలో కేజీఎఫ్ కీలకపాత్ర పోషించాలని పిలుపిచ్చారు. హైదరాబాద్ ను విశ్వనగరంగా మార్చటంలో కేజీఎఫ్ ఏ విధంగా కీలకపాత్ర పోషించగలదు ?

ఏ విధంగా అంటే పెట్టుబడులు పెట్టడం ద్వారా మాత్రమే. డైరెక్టుగా కాకుండా హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టమని రేవంత్ కమ్మసామాజికవర్గంలోని పారిశ్రామికవేత్తలను అడిగారు. కమ్మ సామాజికవర్గంలోని నిపుణుల నైపుణ్యాలను ప్రోత్సహించటానికి తమ ప్రభుత్వం రెడీగా ఉందని రేవంత్ అన్నారు. ప్రపచంలోని అన్నీ రంగాల్లో రాణించిన కమ్మ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించటానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రేవంత్ చెప్పారు. పైగా రాష్ట్రంలో కమ్మవారికి తగిన గుర్తింపు, ఎదగటానికి అవకాశాలు ఉంటాయనే బంపర్ ఆఫర్ కూడా ప్రకటించారు. కేజీఎఫ్ సమ్మిట్ లో రేవంత్ ఇచ్చిన పిలుపు, చేసిన ప్రసంగం కమ్మ సామాజికవర్గంలోని పారిశ్రామికవేత్తలను ఆకర్షించేట్లుగా ఉంది.

ఇక్కడే రేవంత్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రయత్నాలకు టెండర్ పెడుతున్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎలాగంటే సీఎంగా బాధ్యతలు తీసుకోగానే పారిశ్రామికవేత్తలు ఏపీకి వచ్చి పెట్టుబడులు పెట్టాలని పిలుపిచ్చిన విషయం తెలిసిందే. అంటే పెట్టుబడుల కోసం అటు చంద్రబాబు ఇటు రేవంత్ ఇద్దరూ పోటీపడుతున్నారు. అమరావతికి పారిశ్రామికవేత్తలను ఆకర్షించటం ద్వారా మరో 30 ఏళ్ళు టీడీపీకి ఎదురులేకుండా చేసుకోవాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీకి పరిశ్రమలను తెచ్చానని, పెట్టుబడులు వచ్చాయని, నిరుద్యోగాన్ని తగ్గించానని చెప్పుకోవటం చంద్రబాబుకు చాలా అవసరం.

ఇదే సమయంలో తన హయాంలో హైదరాబాద్ పారిశ్రామికంగా మరింత ఉన్నతస్ధాయికి చేరుకుందని, పరిశ్రమలు తీసుకొచ్చానని, ఇన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని, ఇంతమందికి ఉద్యోగవకాశాలు కల్పించానని చెప్పుకోవాల్సిన అవసరం రేవంత్ కు చాలావుంది. మామూలుగా ఏ పారిశ్రామికవేత్తయినా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం చేసుకోవాలని ప్రయత్నిస్తారు. కాబట్టి పారిశ్రామికవేత్తల ప్రయత్నాలు సక్సెస్ కావాలంటే అందుకు బెస్ట్ ప్టేస్ హైదరాబాద్ మాత్రమే అనటంలో సందేహంలేదు. ఎందుకంటే హైదరాబాద్ అన్నది వడ్డించిన విస్తరిలాంటిది. ఏ పారిశ్రామికవేత్త కూడా పెట్టుబడులు పెట్టి, వందలు, వేలాదిమందికి ఉద్యోగావకాలు కల్పించి, ప్రాంతాన్ని అభివృద్ధిచేసి తాము అభివృద్ధి చెందటం ద్వారా లాభాలు అందుకోవాలని కోరుకోరు. ఎందుకంటే ఇదంతా చాలా సుదీర్ఘమైన ప్రక్రియ.

వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలు అన్నీ సంవత్సరాల పాటు వెయిట్ చేయాలని అనుకోరు. ఇపుడు అమరావతిలో పెట్టుబడులు పెట్టాలంటే లాభాల కోసం పారిశ్రామికవేత్తలు ఎన్ని సంవత్సరాలు ఎదురుచూడాలో తెలీదు. అదే హైదరాబాద్ అయితే వడ్డించిన విస్తరి కాబట్టి తీసుకున్న భూములకు కనీసం రియల్ ఎస్టేట్ వాల్యూ అయినా ఉంటుంది. ఇక్కడే పెట్టుబడులను ఆకర్షించటంలో చంద్రబాబుకే రేవంత్ టెండర్ పెడుతున్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇపుడు రెండురోజుల సమ్మిట్ కు హాజరైన వారిలో అత్యధికుల సొంతూళ్ళు ఏపీలోనే ఉన్నా పర్మినెంట్ అడ్రస్ మాత్రం హైదరాబాదే అనటంలో సందేహంలేదు. కాబట్టి ఏ కోణంలో చూసినా పెట్టుబడుల విషయంలో చంద్రబాబుకు రేవంత్ గట్టి పోటీ ఇస్తున్నారనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

Read More
Next Story