డీలిమిటేషన్ ప్రతిపాదనను వ్యతిరేకించాలని ప్రతిపక్షాలను కోరిన రేవంత్
x
Revanth in Assembly

డీలిమిటేషన్ ప్రతిపాదనను వ్యతిరేకించాలని ప్రతిపక్షాలను కోరిన రేవంత్

డీలిమిటేషన్ ను వ్యతిరేకించటం అన్నది కాంగ్రెస్ స్టాండుగా చూడకుండా యావత్ దక్షిణాది రాష్ట్రాల సమస్యగా చూడాలని అసెంబ్లీలో ప్రతిపక్షాలకు విజ్ఞప్తిచేశారు


కేంద్రప్రభుత్వ పరిశీలనలో ఉన్న డీలిమిటేషన్ ప్రతిపాదనలను వ్యతిరేకించాలని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. డీలిమిటేషన్ ను వ్యతిరేకించటం అన్నది కాంగ్రెస్ స్టాండుగా చూడకుండా యావత్ దక్షిణాది రాష్ట్రాల సమస్యగా చూడాలని అసెంబ్లీలో ప్రతిపక్షాలకు విజ్ఞప్తిచేశారు. ఇపుడుగనుక తెలంగాణలోని ప్రతిపక్షాలన్నీ కేంద్రం ప్రతిపాదిస్తున్న డీలిమిటేషన్ను వ్యతిరేకించకపోతే తెలంగాణకు తీరని అన్యాయం చేసినట్లవుతుందని విజ్ఞప్తితో కూడిన వార్నింగ్ ఇచ్చారు. సభలో ఉన్న బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, సీపీఐ తన ప్రతిపాదనకు ఏకగ్రీవంగా మద్దతుగా పలకాలని కోరారు.

జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేయాలని కేంద్రం పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఈ పద్దతిలో డీలిమిటేషన్(Delimitation) జరిగితే కుటుంబనియంత్రణ చట్టాన్ని పక్కాగా పాటించిన దక్షిణాది రాష్ట్రాలు(South States) తీవ్రంగా నష్టపోవటం ఖాయమని రేవంత్(Revanth) ఆందోళన వ్యక్తంచేశారు. డీలిమిటేషన్ వల్ల ఎంపీల సీట్లలో బాగా హెచ్చుతగ్గులు పెరిగిపోతే ఉత్తరాధి రాష్ట్రాలు, దక్షిణాది రాష్ట్రాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయని హెచ్చరించారు. జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేస్తే పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం 24 నుండి 19కి తగ్గిపోతుందన్నారు. జాతీయరాజకీయాల్లోనే కాకుండా పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం, ప్రభావాన్ని తగ్గించేందుకే జనాభా ఆధారంగా డీలిమిటేషన్ జరగాలని నరేంద్రమోడి(Narendra Modi) ప్లాన్ చేసినట్లు రేవంత్ ఆరోపించారు.

కేంద్రప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టేందుకే తాను అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టినట్లు చెప్పారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఏపీ(AP), తెలంగాణ(Telangana)లో నియోజకవర్గాల పునర్విభజన చేయాలని చెప్పారు. కాని కేంద్రం అలాచేయకుండా వివక్ష చూపిస్తున్నట్లు మండిపడ్డారు. తాను ఇదే విషయాన్ని పార్లమెంటులో అడిగితే 2026 తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన చేస్తామని సమాధానం ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. జమ్మూ-కాశ్మీర్ లో రాజ్యాంగాన్ని సవరించి 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాలను 83 నుండి 90కి పెంచినట్లు చెప్పారు. 2018 మంత్రివర్గం తీర్మానం ఆధారంగా సిక్కిం(Sikkim)లో ఇపుడు నియోజకవర్గాల పునర్విభజన చేస్తున్నట్లు చెప్పారు. జమ్మూ-కాశ్మీర్, సిక్కిం రాష్ట్రాల విషయంలో ఒకలాగ, తెలంగాణ, ఏపీ విషయంలో మరోలాగ కేంద్రం వ్యవహరిస్తోందని మండిపోయారు. ఇలాంటి వివక్షను అందరికీ చెప్పేందుకే తాను అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టినట్లు చెప్పారు.

కేంద్రప్రభుత్వం డీలిమిటేషన్ను రాజకీయాలకు అతీతంగా చేయాలని రేవంత్ సూచించారు. తొందరలోనే డిప్యుటి సీఎం భట్టి విక్రమార్క(Bhatti), సీనియర్ నేత కుంటూరు జానారెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించబోతున్నట్లు రేవంత్ ప్రకటించారు. ఆసమావేశానికి అన్నీపార్టీలు హాజరై ప్రభుత్వం ప్రతిపాదించబోయే తీర్మానానికి సంపూర్ణమద్దతు తెలపాలని రేవంత్ కోరారు.

Read More
Next Story