బిజెపి చేతిలోనూ రెడ్ బుక్..
x

బిజెపి చేతిలోనూ రెడ్ బుక్..

బిజెపి చేతిలోనూ రెడ్ బుక్ కనిపించింది. కైకలూరు బిజెపి అభ్యర్థి కామినేని శ్రీనివాస్ రెడ్ బుక్ చూపిస్తూ పోలీసులపై విరుచుకుపడుతున్నారు.


కృష్ణాజిల్లా కైకలూరు బిజెపి అభ్యర్థి రెడ్ బుక్ చూపించి అధికారులను బెదిరిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేశ్ రెడ్ బుక్ చేత పట్టుకుని అధికారులకు వార్నింగ్ లు ఇస్తూ వస్తున్నారు. ఈ రెడ్ బుక్ పై సీఐడీ పోలీసులు నారా లోకేష్ పై కేసు పెట్టారు. ప్రస్తుతం కోర్టులో విచారణ జరుగుతోంది. అయినా రెడ్ బుక్ చూపించడం లోకేష్ మానుకోలేదు. ఎన్నికల ప్రచారంలో రెడ్ బుక్ వ్యవహారం కొనసాగుతూనే ఉంది. తాజాగా కైకలూరు బిజెపి అభ్యర్థి కామినేని శ్రీనివాస్ రెడ్ చూపిస్తూ ప్రచారం చేయడం పలువురిని ఆకర్షిస్తోంది. కామినేని శ్రీనివాస్ 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పొత్తులో కైకలూరు నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తరువాత మంత్రి కూడా అయ్యారు. ఆ సమయంలో చంద్రబాబు చెప్పినట్లు పనిచేసేవారు. పేరుకే బిజెపి తప్ప కార్యక్రమాలన్నీ తెలుగుదేశం పార్టీతోనే ఉండేవి. ఇప్పుడు కూడా ఇవే పరిస్థితులు ఉన్నాయి.

మిమ్మల్ని ఎవరైతే ఇబ్బందులు పెట్టి కష్టపెడుతున్నారో అటువంటి పోలీస్ అధికారుల పేర్లు రెడ్ బుక్ లో పెట్టి అధికారంలోకి రాగానే వారిపై చర్యలు తీసుకుంటాం. మీరు సాక్ష్యాలతో నా దగ్గరికి పోలీసుల దురాగతాలు తీసుకురండి చూస్తా. వారిని సస్పెండ్ చేయడంతో పాటు వీఆర్ కు పంపిస్తాం. అంటూ పోలీసులను హెచ్చరించడం విశేషం. ప్రచారంలో దాదాపు ప్రతి చోటా ఇదే తంతు జరుగుతోంది. ఈ రెడ్ బుక్ ల వ్యవహారం అర్థం కాక పోలీసులు తల పట్టుకుంటున్నారు. కుల సంఘాలు, ముఖ్య కార్యకర్తలతో కామినేని ప్రత్యేక పమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో రెడ్ బుక్ వ్యవహారం తెరపైకి వచ్చింది. రెడ్ బుక్ చూపించి కార్యకర్తలకు పోలీసుల నుంచి రక్షణ ఉంటుందని చెప్పడం విశేషం.

టిడిపి మూలాల నుంచి వచ్చిన విత్తనమే కావడం వల్ల బిజెపిలో ఉన్నా లోకేష్ చేసిన తరహాలోనే ప్రచారాన్ని కామినేని శ్రీనివాస్ ఫాలో అవుతున్నారు. ఐదేళ్ల నుంచి కామినేని శ్రీనివాస్ హైదరాబాద్ లో వుంటున్నారు. బిజెపి టిక్కెట్ ఇవ్వగానే తిరిగి కైకలూరులో ప్రత్యక్షమయ్యారు. నేను ఇకపై ఇక్కడే ఉంటానని, మీరు గెలిపిస్తే మీ మధ్యే ఉంటానని చెబుతున్నారు. మంత్రి పదవి పోయిన తరువాత హైదరాబాద్ వెళ్లిన కామినేని తిరిగి ఎన్నికల సమయంలోనే కనిపించడం నియోజకవర్గంలోని పలువురు ఓటర్లలో చర్చనియాంశమైంది.

Read More
Next Story