ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రారంభం
x

ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రారంభం

47 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్లను నియమించారు. వీటిలో 37 టీడీపీ, 8 జనసేన, 2 బీజేపీకి దక్కాయి. ఇది తొలి విడత మాత్రమేనని, త్వరలో మరికొన్ని నియామకాలు చేపడతారు.


ఆంధ్రప్రదేశ్ లో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలైంది. ఇందులో భాగంగా తొలుత మార్కెట్ కమిటీలకు ఛైర్మన్ల నియామకం చేపట్టింది. తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 47 మార్కెట్ కమిటీల(ఏఎంసీ)కు ఛైర్మన్లను కూటమి ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం సభ్యులతో కలిపి 705 నామినేటెడ్‌ పదవులను భర్తీ చేసింది. ప్రజాభిప్రాయ సేకరణ ప్రకారం నామినేటెడ్ పోస్టుల్ని ఇచ్చినట్టు టీడీపీ వర్గాలు తెలిపాయి. తాజాగా ప్రకటించిన 47 ఏఎంసీ ఛైర్మన్‌ పదవుల్లో 37 తెలుగుదేశం (TDP), 8 జనసేన (Janasena), 2 బీజేపీకి (BJP) నాయకులకు దక్కాయి. త్వరలోనే మిగతా మార్కెట్‌ కమిటీల ఛైర్మన్లను ప్రకటించనున్నారు.
నియమితులైన మార్కెట్ కమిటీలు (ప్రభుత్వ జీవో ప్రకారం ఇలా ఉన్నాయి.)

జేఎస్పీ అంటే జనసేన, టీడీపీ-తెలుగుదేశం, బీజేపీ- భారతీయ జనతాపార్టీ.
Read More
Next Story