రికార్డు స్థాయిలో దుర్గమ్మను దర్శించుకున్న భక్తులు
x

రికార్డు స్థాయిలో దుర్గమ్మను దర్శించుకున్న భక్తులు

ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలకు గతేడాది కంటే ఈ సంవత్సరం భారీగా భక్తులు తరలి వచ్చారు.


ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఘనంగా నిర్వహించిన దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఈ ఏడాది భారీ భక్తుల ఆనంద ఉత్సాహాలతో ముగిసాయి. ఈ ఉత్సవాల ప్రారంభం నుంచి విజయదశమి వరకు రికార్డు స్థాయిలో భక్తులు తరలివచ్చి, దుర్గమ్మను దర్శించుకున్నారు. గత ఏడాది కంటే 15 శాతం ఎక్కువగా భక్తులు చేరుకున్నట్టు అధికారులు తెలిపారు. సెప్టెంబర్‌ 22 నుంచి అక్టోబర్‌ 2 వరకు జరిగిన ఈ దుర్గమ్మ అమ్మవారి ఉత్సవాల్లో మొత్తం 15,03,487 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఇంకా భవానీ మాల ధరించిన భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తున్న క్రమంలో మొత్తం భక్తుల సంఖ్య 20 లక్షలకు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

గత ఏడాది దాదాపు 13 లక్షల మంది భక్తులు ఇంద్రకీలాద్రికి చేరుకున్నప్పటికీ, ఈసారి ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. ముఖ్యంగా, భవానీ మాలలు ధరించిన పురుషులు, మహిళలు, కుటుంబాలు ఈ ఉత్సవాలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. శుక్రవారం సాయంత్రం వరకు రికార్డ్‌ చేసిన భక్తుల సంఖ్యే అధికారుల అంచనాలకు మించినదని, ఈ ఉత్సాహం విజయవాడ పట్టణాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చిందని ఆలయ అధికారులు పేర్కొన్నారు.
విజయదశమి రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వగా, శుక్రవారం కూడా ఈ అలంకారంలోనే ఉండి, భక్తుల మనసులను ఆకట్టుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అమ్మవారి దర్శనం కోసం వేలాది మంది భక్తులు క్యూలు కట్టి ఉండటం, వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, సవ్యంగా అమ్మవారి దర్శనం జరిగేలా చూడటంలో భద్రతా సిబ్బంది కూడా నిర్విరామంగా సేవలు అందించారు. భవానీ మాలలు ధరించిన భక్తుల రాకా ఇంకా కొనసాగుతుండటంతో ఈ ఏడాది భక్తుల రాక 20 లక్షలకు చేరుకునే సూచనలు కనిపిస్తున్నాయి అని ఆలయ అధికారులు అంచాన వేస్తున్నారు. అత్యంత వైభవంగా జరిగిన ఈ ఏడాది దుర్గమ్మ అమ్మవారి దరసరా నవరాత్రి ఉత్సవాలు విజయవాడను దేవాలయ నగరంగా మర్చేశాయనే అభిప్రాయం భక్తల నుంచి వినిపిస్తోంది.
Read More
Next Story