ఎన్నికల ఫలితాల కోసం ఆతృతగా ఎదురుచూస్తోంది రియల్టర్లే!
x

ఎన్నికల ఫలితాల కోసం ఆతృతగా ఎదురుచూస్తోంది రియల్టర్లే!

ఆంధ్ర ఎన్నికల ఫలితాల కోసం ప్రత్యర్థి పార్టీలయిన వైసీపీ, టీడీపీలకన్నా ఆతృతగా రాష్ట్రంలోని రియల్‌ఎస్టేట్ వ్యాపారులు ఎదురుచూస్తున్నారు. అందులోనూ ముఖ్యంగా..


ఆంధ్ర ఎన్నికల ఫలితాల కోసం ప్రత్యర్థి పార్టీలయిన వైసీపీ, టీడీపీలకన్నా ఆతృతగా రాష్ట్రంలోని రియల్‌ఎస్టేట్ వ్యాపారులు ఎదురుచూస్తున్నారు. అందులోనూ ముఖ్యంగా విశాఖ, అమరావతి పరిసరాల్లోని వారు జూన్ 4 ఎప్పుడొస్తుందా అంటూ కళ్లుకాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఆ రోజున వచ్చే ఎన్నికల ఫలితాలు రాష్ట్రభవిష్యత్తునే కాదు తమ భవిష్యత్తును కూడా పూర్తి మార్చేస్తాయని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ఫలితాలు ఏమైనా నిజంగానే విశాఖ, అమరావతి రియల్టర్ల భవిష్యత్తు మారనుందని ప్రజలు కూడా అంటున్నారు.

అందుకే ఎదురుచూపులు

జూన్ 4న విడుదలయ్యే ఆంధ్ర ఎన్నికల ఫలితాల కోసం రియల్టర్లు అంతగా ఎదురు చూడటానికి చాలా బలమైన కారణాలే ఉన్నాయి. ఒక్కసారి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం రానున్నది అనేది తేలితే తమ వ్యాపారం విషయంలో ఫైనల్ డెసిషన్స్ తీసుకోవాలని వారు చూస్తున్నారు. అదే విధంగా ఒక్కసారి కొత్త ప్రభుత్వం ఏర్పడి పనిచేయడం ప్రారంభిస్తే వచ్చే ప్రభుత్వాన్ని బట్టి విశాఖ, అమరావతి ప్రాంతాల్లో రియల్‌ఎస్టేట్ రేట్లను కూడా మేనేజ్ చేయడానికి ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు విశ్లేషకులు చెప్తున్నారు.

ప్రభావితం చేస్తున్న పార్టీల

ఎన్నికల ఫలితాల కోసం రియల్టర్లు చేస్తున్న నిరీక్షణను రాజకీయ పార్టీలు చేస్తున్న ప్రకటనలు తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. వైసీపీ వాళ్లు మరోసారి సీఎం పీఠంపై జగనే కూర్చుంటారని, విశాఖ కేంద్రంగా పాలన కొనసాగిస్తారని ప్రచారం చేస్తున్నారు. మరోవైపు టీడీపీ వాళ్లు ఈసారి వచ్చేది బాబు ప్రభుత్వమే, చంద్రబాబు సీఎం అయిన వెంటనే ఆగిపోయిన అమరావతిని నిర్మాణం తిరిగి ప్రారంభం అవుతుందని టీడీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. దీంతో విశాఖ, అమరావతి రియల్టర్లు కొండంత ఆశలతో ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. తాము తీసుకోవాల్సిన నిర్ణయాలపై కూడా కసరత్తులు చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత రాష్ట్రంలో తొలుత లాభపడే రంగం కూడా రియల్ ఎస్టేట్ కానుండటం గమనార్హం.

‘ఫలితాల కోసమే నిరీక్షణ’

తాము ఎన్నికల ఫలితాల కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నామని కాన్ఫెడెరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డవలపర్స్ అసోసియేషన్(సీఆర్‌ఈడీఏఐ) ఉపాధ్యక్షుడు అశోక్ కుమార్ వెల్లడించారు. ‘‘ఈ ఎన్నికల తర్వాత విశాఖ అభివృద్ధిపై మేము చాలా ఆశలు పెట్టుకుని ఉన్నాం. విశాఖ అభివృద్ధి విషయంలో వైఎస్ జగన్, చంద్రబాబు నాయుడు ఇద్దరూ కూడా తమతమ వ్యూహాలను సిద్ధం చేసుకుని ఉన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా నగర అభివృద్ధి విషయంలో శుభశకుణాలు ఉంటాయని భావిస్తున్నాం. రియల్ ఎస్టేట్‌తో పాటుగా విశాఖ.. ఐటీ, రక్షణ, సీఫుడ్ ఎగుమతులు, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, మెడికల్ టూరిజం వంటి రంగాల్లో ముందడుగు వేస్తుందని భావిస్తున్నాం’’అని వెల్లడించారు.

Read More
Next Story