వైఎస్సార్‌సీపీకి విడదల రజిని రాజీనామా?
x

వైఎస్సార్‌సీపీకి విడదల రజిని రాజీనామా?

మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నాయకురాలు విడదల రజిని వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసినట్లు విశ్వసనీయ సమాచారం.


ఏపీలో వైఎస్సార్‌సీపీ నుంచి నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రులు ఒక్కొక్కరుగా బయటకు వెళ్లి పోతున్నారు. పార్టీలో ఉన్నంత సేపు క్రమశిక్షణ గల నాయకులుగా చెప్పుకుంటున్నారు. జగనన్న పేదల మనిషి అని పొగిడిన నాయకులు ఉన్నట్లుండి పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీలో వెలుగు వెలిగిన వైద్య ఆరోగ్య శాఖ మాజీ మంత్రి విడదల రజిని వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసినట్లు సన్నిహితులు చెబుతున్నారు. అయితే రాజీనామా విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించలేదు.

జగనన్న అంతటి మంచి నాయకుడు లేడని పొగిడిన రజిని ఎందుకు మనసు మార్చుకున్నారనే చర్చ జరుగుతోంది. చిలకలూరి పేట నుంచి కాకుండా గత ఎన్నికల్లో గుంటూరు నుంచి పోటీ చేయించారు జగన్. రాష్ట్ర వ్యాప్తంగా ఓటమిలో భాగంగా వైఎస్సార్‌సీపీ కూడా ఓడిపోయింది. అందులో భాగంగా రజిని కూడా ఓటమి పాలయ్యారు. అయినా జగన్‌ ఏర్పాటు చేసిన ప్రతి సమావేశానికి క్రమం తప్పకుండా హాజరవుతున్నారు. వైఎస్సార్‌సీపీ యాక్టివ్‌ పాలిటిక్స్‌లో రజిని చురుకుగా ఉంటున్నారు. విదేశాల్లో ఉంటూ రాజకీయాలపై మోజుతో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కూడా అయ్యారు. అంటే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రజినికి మంచి ప్రయారిటీ ఇచ్చిందని చెప్పొచ్చు. రజిని రాజీనామా వెనుక మతలబు ఏమిటనేది తెలియాల్సి ఉంది. ఆమె రాజీనామా చేసినట్లు సోషల్‌ మీడియాలో ఒక వార్త తిరుగుతోంది. ఆమె దానిని ఖండించలేదు.


Read More
Next Story