ఈ నెల 17 నుంచి ఏపీలో వర్షాలు
x

ఈ నెల 17 నుంచి ఏపీలో వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌కు మళ్లీ అల్పపీడన ప్రమాదం పొంచి ఉంది. దక్షిణ తీర ప్రాంతాల్లో దీని ప్రభావం ఉండనుంది.


డిసెంబరు 17 నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తా ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయి. 17వ తేదీ రాత్రి నుంచి ఏపీ తీర ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ అండమాన్‌ సముద్రంపై శనివారం ఉపరితల ఆవర్తనం ఏర్పడే సూచనలు ఉన్నాయని.. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంతంపై ఉంటుందని, దీని వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తా ప్రాంతాల్లో వర్ష ప్రభావం ఉండనుందని తెలిపింది. వరుస అల్పపీడన ప్రభావాలతో రైతులు ఆందోళనలకు గురవుతున్నారు. పంటలు కోతకు వచ్చే సమయంలో వర్షాల భయంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.

Read More
Next Story