ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామకృష్ణంరాజు ఏకగ్రీవం
x

ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామకృష్ణంరాజు ఏకగ్రీవం

రఘురామకృష్ణంరాజును ట్రిపుల్‌ ఆర్‌గా పిలుస్తుంటారు. జగన్‌ ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. ఎన్నికల ముందు టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు.


ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణమరాజు ఎన్నికయ్యారు. ఆ మేరకు అసెంబ్లీ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. డిప్యూడీ స్పీకర్‌ పదవికి రఘురామకృష్ణం రాజు నామినేషన్‌ ఒక్కటే దాఖలు కావడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు స్పీకర్‌ గురువారం సభలో ప్రకటించారు. డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైనందుకు రఘురామకృష్ణ రాజుకు స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు అభినందనలు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ పదవికి ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజును కూటమి ప్రభుత్వం నేతలు అంతకుముందు ప్రకటించారు. కూటమి మంత్రులు సత్యకుమార్‌ యాదవ్, నాదెండ్ల మనోహర్, నారా లోకేష్, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడుతో పాటు టీడీపీ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావులతో కలిసి రఘురామకృష్ణంరాజు బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు.
నామినేషన్‌ దాఖలు చేయక ముందే ట్రిపుల్‌ఆర్‌ గెలుపు ఖాయమైంది. అసెంబ్లీలో కూటమి బలం ఎక్కువుగా ఉండటం, వైఎస్‌ఆర్‌సీపీకి తక్కువ బలం ఉండటం, డిప్యూటీ స్పీకర్‌ పదవి పోటీకీ ఆ పార్టీ దూరంగా ఉండటం వంటి కారణాలతో డిప్యూటీ స్పీకర్‌గా ట్రిపుల్‌ఆర్‌ ఏకగ్రీవం అనేది ముందుగానే ఊహించారు. మరో వైపు అసెంబ్లీలో చీఫ్‌ విప్‌గా జీవీ ఆంజనేయులు, శాసన మండలిలో చీఫ్‌ విప్‌గా పంచుమర్తి అనురాధను ఇది వరకే నియమించారు.
2019లో వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీగా నర్సపూర్‌ నుంచి గెలుపొందిన రఘురామకృష్ణంరాజు తర్వాత ఆ పార్టీ అధినేత జగన్, నాటి సీఎం జగన్‌ల మధ్య స్నేహం చెడింది. దీంతో వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రకటించారు. జగన్‌ మీద, ఆయన ప్రభుత్వం మీద తరుచు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో నాటి జగన్‌ ప్రభుత్వం ఆయనపై కేసు నమోదు చేయించింది. విచారణ పేరుతో చిత్ర హింసలకు గురి చేసిందని ట్రిపుల్‌ఆర్‌ ఆరోపించారు. 2024 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన ఆయన ఉండి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జగన్‌ ప్రభుత్వం తనను చిత్రహింసలకు గురి చేశారని గుంటూరులో ఫిర్యాదు చేశారు. జగన్‌తో పాటు పోలీసులు ఉన్నతాధికారులు నిందితులుగా పేర్కొంటూ కేసు పెట్టారు. అంతేకాకుండా జగన్‌ అక్రమ ఆస్తుల కేసుపై విచారణ వేగవంతం చేయాలని, ఆ కేసును తెలంగాణ హైకోర్టు నుంచి మార్చాలని సుప్రీం కోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు.
Read More
Next Story