AlluArjun kept mum|పోలీసు విచారణలో నోరిప్పని అల్లుఅర్జున్
x

AlluArjun kept mum|పోలీసు విచారణలో నోరిప్పని అల్లుఅర్జున్

సినిమాలో పోలీసులను గజగజ వణికించిన పుష్ప మంగళవారం విచారణలో పోలీసుల దెబ్బకు నోరెత్తలేకపోయినట్లు సమాచారం.


అల్లుఅర్జున్ సినిమాల్లో మాత్రమే హీరో నిజజీవితంలో జీరోనే అన్న విషయం అర్ధమైపోయింది. సినిమాలో పోలీసులను గజగజ వణికించిన పుష్ప మంగళవారం విచారణలో పోలీసుల దెబ్బకు నోరెత్తలేకపోయినట్లు సమాచారం. ఉదయం 11 గంటల నుండి 1.30 గంటలవరకు చిక్కడపల్లి పోలీసుస్టేషన్లో పోలీసులు అల్లుఅర్జున్(Allu arjun) ను విచారించారు. ఏసీపీ రమేష్, సీఐ రాజునాయక్ తో పాటు మరో ఇద్దరు ఎస్ఐలు పుష్పను సుదీర్ఘంగా విచారించారు. పుష్ప సినిమా(Pushpa Movie) విడుదల సందర్భంగా సంధ్యా థియేటర్లో(Sandhya Theatre) జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించటంతో పాటు ఆమె కొడుకు శ్రీతేజ కోమాలోకి వెళిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఘటనకు సంబంధించి పోలీసులు అల్లుఅర్జున్ పై ఏ11గా కేసు నమోదుచేశారు.

అవటానికి అల్లుఅర్జున్ ఏ11 అయిన ఘటనకు అసలుకారణం తానే కాబట్టి వెంటనే అరెస్టుచేసి కోర్టులో ప్రవేశపెట్టారు. 12 గంటలు చంచల్ గూడ్ జైలులో ఉన్న అల్లుఅర్జున్ కు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వటంతో బయటకు వచ్చాడు. మధ్యంతరబెయిల్ ఇచ్చిన కోర్టు పోలీసువిచారణకు పూర్తిగా సహకరించాలని అల్లుఅర్జున్ ను ఆదేశించింది. ఇందులో భాగంగానే ఆదివారం నోటీసు ఇచ్చిన పోలీసులు మంగళవారం విచారించారు. జరిగిన ఘటనతో తనకు సంబంధంలేదనే మొదటినుండి అల్లుఅర్జున్ చెబుతున్నాడు. తొక్కిసలాటలో మహిళ మరణించిన విషయం కూడా తనకు మరుసటిరోజే తెలిసిందన్నాడు. తొక్కిసలాట జరుగుతున్నది కాబట్టి తనను వెళిపొమ్మని థియేటర్ యాజమాన్యం చెప్పగానే తానువెళిపోయినట్లు అల్లుఅర్జున్ మీడియాతో చెప్పాడు. తానసలు రోడ్డుషో చేయనేలేదని కూడా అన్నాడు.

పైగా రేవంత్, పోలీసులు తనపైన దుష్ప్రచారం చేస్తున్నారని, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారంటు మండిపోయాడు. అల్లుఅర్జున్ చేసిన ఆరోపణలు, ఎదురుదాడిని దృష్టిలో పెట్టుకున్న పోలీసులు అవేఅంశాలపై రెండున్నరగంటలసేపు ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు వేసిన చాలా ప్రశ్నలకు అల్లుఅర్జున్ నోరిప్పలేదని సమాచారం. ఎందుకంటే మీడియాలో తాను చెప్పిందంతా అబద్ధాలే అని పోలీసు 10 నిముషాల వీడియో సాక్ష్యాలతో చూపించారు కాబట్టే. పుష్ప చెప్పింది ఏమిటంటే తాను రోడ్డుషో చేయలేదని. కాని పోలీసులు చూపించిన వీడియోలో 830 మీటర్లు ఓపెన్ టాప్ కారులో అభిమానులకు అభివాదంచేస్తున్న అర్జున్ కనిపించాడు(Arjun Road Show). దాంతో తాను రోడ్డుషో చేయలేదని చెప్పటం అబద్ధమని తేలిపోయినట్లు అల్లుఅర్జున్ కు అర్ధమైంది.

అలాగే తొక్కిసలాటలో మహిళ మరణించిన విషయం అప్పుడే అర్జున్ కు తెలుసన్న విషయాన్ని పోలీసులు నిరూపించారు. అంతకుముందు అల్లుఅర్జున్ మీడియాతో మాట్లాడుతు మహిళ చనిపోయిన విషయం మరుసటిరోజే తనకు తెలిసిందన్నాడు. ఘటన జరిగినపుడే మహిళ చనిపోయిందని తెలిసినా మరుసటిరోజు మాత్రమే తెలిసిందని ఎందుకు చెప్పారని అడిగిన ప్రశ్నకు కూడా అల్లుఅర్జున్ సమాధానం చెప్పలేదు. ఎందుకంటే, తొక్కిసలాటలో మహిళ మరణించిన విషయాన్ని పోలీసులు మేనేజర్ ద్వారా కబురుచేశారు. అయితే అల్లుఅర్జున్ స్పందిచకపోవటంతో కొద్దిసేపటి తర్వాత పోలీసులే అర్జున్ దగ్గరకు వెళ్ళి మహిళమరణించిన విషయంచెప్పి బలవంతంగా ఖాళీచేయించారని బయటపడింది. ఎలాగంటే తామే అల్లుఅర్జున్ కు మహిళ మరణంగురించి చెప్పినా పట్టించుకోలేదని ఏసీపీ మీడియా సమావేశంలో చెప్పారు.

అందుకనే ఈ విషయంపైన కూడా పుష్ప నోరిప్పలేదు. మొత్తంమీద రెండున్నరగంటల విచారణలో కీలకమైన ఐదారు ప్రశ్నలకు అల్లుఅర్జున్ ఎన్నిసార్లు అడిగినా నోరిప్పలేదని పోలీసువర్గాల సమాచారం. థియేటర్లో తన బౌన్సర్ల ఓవర్ యాక్షన్(Bouncers Over Action) వల్లే సమస్య పెద్దదయినట్లు అల్లుఅర్జున్ వీడియో చూసి గ్రహించినట్లు సమాచారం. పోలీసులు వీడియోను ప్రదర్శిస్తు ప్రశ్నలు అడగటంతో తాము అంతకుముందు మీడియాలో మాట్లాడిన మాటలకు ఏమీ సమాధానం చెప్పలేకపోయాడు.

Read More
Next Story