Pushpa in Jail|ఎర్రచందనం స్మగ్లింగ్ నుండి చంచల్ గూడ జైలుకు పుష్ప ప్రయాణం
x

PUSHPA 2 (WIKIPEDIA)

Pushpa in Jail|ఎర్రచందనం స్మగ్లింగ్ నుండి చంచల్ గూడ జైలుకు పుష్ప ప్రయాణం

వేలకోట్ల రూపాయల విలువైన ఎర్రచందనం స్మగ్లింగును విజయవంతంగా చేసిన పుష్పరాజ్ చివరకు తొక్కిసలాటఘటనకు బాధ్యుడనే కారణంగా జైలుపాలయ్యాడు.


వేలకోట్ల రూపాయల విలువైన ఎర్రచందనం స్మగ్లింగును విజయవంతంగా చేసిన పుష్పరాజ్ చివరకు తొక్కిసలాటఘటనకు బాధ్యుడనే కారణంగా జైలుపాలయ్యాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ ఏమిటి ? తొక్కిసలాటకు బాధ్యుడు ఏమిటి ? అంటే అంతాకూడా పుష్ప-2(Pushpa-2) సినిమాకు సంబంధించిందనే విషయమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసింది పుష్పరాజ్ అలియాస్ అల్లు అర్జునే(Allu Arjun), సినిమా థియోటర్లో తొక్కిసలాటకు కారణమైందీ అల్లు అర్జునే. తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయింది. తన భార్య మృతికి అల్లుఅర్జునే కారణమని భర్త భాస్కర్ ఇచ్చిన ఫిర్యాదు కారణంగా పోలీసులు అల్లుఅర్జున్ పైన కేసునమోదుచేశారు. కేసునమోదైంది కాబట్టి శుక్రవారం మధ్యాహ్నం చిక్కడపల్లి పోలీసు(Chikkadapalli Police)లు అల్లు అర్జున్ను అరెస్టుచేశారు.

వేలకోట్ల రూపాయల విలువైన ఎర్రచందనాన్ని స్మగ్లింగ్(Red sandal Smuggling) చేసింది సినిమాలో. సినిమాకాబట్టి కథను రచయిత, దర్శకుడు తమిష్టం వచ్చినట్లు మలుపులు తిప్పారు. అందుకనే సినిమాలో హీరోగా నటించిన అల్లు అర్జున్ వేలకోట్ల రూపాయల ఎర్రచందనాన్ని స్మగుల్ చేసినా పోలీసులనుండి తప్పించుకున్నాడు. కాని సినిమాథియేటర్లో మహిళమృతి అన్నది నిజజీవితంలో జరిగింది. నిజజీవితంలో జరిగేవన్నీ భగవంతుడి స్క్రిప్టేకాని సినిమా రచయిత, దర్శకుడికి ఎలాంటి సంబంధంలేదు. అందుకనే ప్యాన్ ఇండియా స్టార్ గా అవతరించిన అర్జున్ వేరేదారిలేక చిక్కడపల్లి పోలీసుస్టేషన్ కు వెళ్ళి అక్కడి నుండి గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుని, నాంపల్లి కోర్టు విధించిన రిమాండు కారణంగా చంచల్ గూడ జైలులో కూర్చోవాల్సొచ్చింది.

చాలామంది సినిమాసెలబ్రిటీలకు సినిమా జీవితానికి, నిజజీవితానికి తేడా ఉండదని అనుకుంటారు. సినిమాల్లో చట్టాలను ఉల్లంఘించినా శిక్షలు పడనట్లే, తప్పించుకున్నట్లే నిజజీవితంలో కూడా జరుగుతుందని అనుకుంటారు. కాని ఇపుడు ఏమైందంటే నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండు విధించింది. 14 రోజుల రిమాండు కారణంగా మిగిలిన అందరిలాగే పుష్పరాజ్ అలియాస్ అల్లుఅర్జున్ కూడా జైలులో 14 రోజులు ఉండక తప్పదు.

Read More
Next Story