AlluArjun|పుష్ప అంటే ఫైర్ కాదు ఫ్లవరేనా ?
x

AlluArjun|పుష్ప అంటే ఫైర్ కాదు ఫ్లవరేనా ?

ఇదంతా సినిమాలో మాత్రమేనని నిజజీవితంలో మాత్రం అల్లుఅర్జున్ ఫైర్ కాదు ఉత్త ఫ్లవరే అని అర్ధమైపోయింది.


‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా ? కాదు ఫైర్..వైల్డ్ ఫైర్’ అనే డైలాగు చాలా పాపులర్. ఇంతకీ ఈ డైలాగు ఏ సినిమాలోనిది అంటే పుష్ప సినిమా(Pushpa Movie)లోనిదే. సినిమాలో హీరో అల్లుఅర్జున్(Allu Arjun) విలన్లను ఉద్దేశించి పై డైలాగ్ చెబుతాడు. సినిమాలో పై డైలాగు బాగా పాపులరైంది. జనాలు కూడా ఈ డైలాగుకు బాగా కనెక్టయ్యారు. అయితే ఇదంతా సినిమాలో మాత్రమేనని నిజజీవితంలో మాత్రం అల్లుఅర్జున్ ఫైర్ కాదు ఉత్త ఫ్లవరే అని అర్ధమైపోయింది. మూడున్నర గంటల చిక్కడపల్లి పోలీసుఅధికారుల విచారణలో ఈవిషయం అందరికీ స్పష్టమైపోయింది. విచారణలో పోలీసు అధికారులు అడిగిన చాలా ప్రశ్నలకు అల్లుఅర్జున్ అలియాస్ పుష్ప సమాధానాలు చెప్పలేకపోయినట్లు సమాచారం. పుష్పసినిమా రిలీజ్ సందర్భంగా సంథ్యా ధియేటర్లో(Sandhya Theatre Stampeding) తొక్కిసలాట జరగటం, రేవతి అనే మహిళ మరణించటం, ఆమెకొడుకు శ్రీతేజ్ కోమాలోకి వెళ్ళటం అందరికీ తెలిసిందే.

ఘటన జరిగిన మరుసటిరోజు పుష్ప మీడియాతో మాట్లాడుతు ‘జరిగిన ఘటనతో తనకు ఏమీ సంబంధంలేద’న్నాడు. ‘తొక్కిసలాటలో మహిళ మరణించిన విషయం కూడా తనకు తెలీద’న్నాడు. ప్రచారం జరుగుతున్నట్లుగా తాను రోడ్డుషో చేయలేదని ఖండించాడు. జస్ట్ అభిమానులను హుషారు చేయటంకోసమే తాను ఓపెన్ టాప్ వెహికల్ లో నిలబడినట్లు చెప్పుకున్నాడు. అయితే ఆ తర్వాత జరిగిన పోలీసులవిచారణలో సమాధానాలు చెప్పలేకపోయాడు. అల్లుఅర్జున్ రాకముందు థియేటర్ దగ్గర వాతావరణం ఎలాగుంది ? పుష్ప ఎంటరైన తర్వాత వాతావరణం ఎలాగ మారిపోయింది, అంతకుముందు ముషీరాబాద్ మెయిన్ రోడ్డులో జరిపిన రోడ్డుషో తాలూకు వీడియోలను చూపించినపుడు అల్లుఅర్జున్ నోట మాట రాలేదట. విచారణకు ముందు తాను మీడియాతో మాట్లాడిన మాటలన్నీ అబద్ధాలే అని స్వయంగా పుష్ప అంగీకరించినట్లయ్యింది.

మీడియాతో తాను మాట్లాడుతున్నది అంతా అబద్ధాలే అని తెలిసే అల్లుఅర్జున్ మీడియాకు పదేపదే అబద్ధాలు చెప్పాడు. అర్జున్ చెప్పిందంతా అబద్ధాలే అని ఎప్పుడైతే పోలీసుఅధికారులు వీడియోల సాక్ష్యంగా నిరూపించారో పుష్ప నోరుపడిపోయింది. అందుకనే పోలీసుల ప్రశ్నలకు పుష్ప ఎలాంటి సమాధానం ఇవ్వలేకపోయాడు. తాను చెబుతున్న అబద్ధాలను పోలీసులు చాలా ఈజీగా బయటపెడతారని, ఎక్కడికక్కడ వీడియోలు, మొబైల్ ఫోన్లలో వీడియోలో తీసే అవకాశం ఉన్నపుడు జరిగిన ఘటనను కొన్నివందలమంది రికార్డు చేస్తారన్న కనీస స్పృహకూడా అల్లుఅర్జున్ లో లేకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. తాను చెబుతున్నది అబద్ధాలే అన్నవిషయం వీడియోల రూపంలో బయటపడిపోతుందన్న కనీస ఆలోచన కూడా పుష్పలో లేకపోవటమే విచిత్రం. ఏదేమైనా పోలీసుల విచారణ దెబ్బకు అల్లుఅర్జున్ సినిమాల్లో మాత్రమే ఫైర్..వైల్డ్ ఫైర్ అని నిజజీవితంలో మాత్రం కేవలం ఫ్లవర్ లాంటివాడే అన్న విషయం రుజువైంది.

Read More
Next Story