PUSHPA 2|అమెరికాలో హోరెత్తుతున్న పుష్ప 2 అడ్వాన్స్ బుకింగ్
x

PUSHPA 2 (WIKIPEDIA)

PUSHPA 2|అమెరికాలో హోరెత్తుతున్న పుష్ప 2 అడ్వాన్స్ బుకింగ్

వాల్టేరు వీరయ్య, ట్రిపుల్ ఆర్ సినిమాలు విడుదలైనపుడు టికెట్ ధరలు 15,20 డాలర్లు. అలాంటిది ఇప్పుడు పుప్ప 2 అడ్వాన్స్ బుకింగ్ ధర ఏకంగా 30 డాలర్లకు మించిపోయింది..


పుష్ప-2: ది రూల్ (PUSHPA 2: The Rule) సినిమా రిలీజ్ కు ముందే రికార్డులు బద్దలు కొడుతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఊరూవాడా దుమ్మురేపుతోంది. ఈ హడావిడి ఇండియాలోనే కాకుండా విదేశాలకు ప్రత్యేకించి అమెరికాకు పాకింది. పుష్ప 2 సినిమా ఇండియాలో కన్నా 12 గంటల ముందు అమెరికాలో రిలీజ్ అవుతుంది. అందువల్లనే ఏమో ఇప్పుడు అక్కడ ఈ సినిమా టికెట్ల అడ్వాన్స్ బుకింగ్ అదిరిపోతుంది. ఇప్పటికి అందుతున్న సమాచారం ప్రకారం అమెరికాలో ఏకంగా 3,230 షోలను ప్రదర్శించనున్నారు. విడుదలకు ఇంకా సమయం ఉండడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.
తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ బీహార్ రాజధాని పాట్నాలో విడుదలైంది. విడుదలైన నాటి నుంచి అది ట్రెండింగ్‌లో ఉంది. ఇప్పటికే ఒక కోటీ 20 లక్షల మంది ఈ ట్రైలర్ ను చూశారు.

ఈ సినిమా విడుదల తేదీ ఖరారు కావడంతో నవంబర్ లో విడుదల కావాల్సిన రామ్ చరణ్ సినిమా 'ది గేమ్ ఛేంజర్' కూడా వాయిదా పడింది. డిసెంబర్ 5న ఇండియాలో విడుదల అవుతుంది.
అమెరికాలో తెలుగువాళ్లు ఎక్కువగా ఉన్న ఏడెనిమిది రాష్ట్రాలలో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 విడుదల కానుంది. విడుదలకు ఇంకా 15 రోజులు సమయం ఉంది. అయినా ఇప్పటికే టికెట్ల అడ్వాన్స్ బుకింగ్ రద్దీ పెరిగింది.
ఈ సినిమా క్రేజీ మామూలుగా లేదని టెక్సాస్ స్టేట్ లోని తెలుగు వారు చెబుతున్నారు. డల్లాస్ నగరంలోని అనేక సినీ కాంప్లెక్స్ లలో ఈ సినిమా విడుదల అవుతుంది. ఇటీవలి కాలంలో ఏ సినిమాకూ లేనంత క్రేజ్ పుష్ప 2కి ఏర్పడింది. మామూలుగా అడ్వాన్స్ బుకింగ్ ధరలు మహా అయితే 15 నుంచి 20 డాలర్ల మధ్య ఉంటుంది. అటువంటిది ఈ సినిమా టికెట్ ధర ఇప్పటికే 30 డాలర్లకు చేరింది. అంటే ఇండియన్ కరెన్సీ లెక్కల్లో చెప్పాలంటే సుమారు 2,500 రూపాయలు. పిల్లలకైతే ఆ ధర రూ.25 డాలర్లుగా ఉంది. అయినా విడుదల అయ్యే రోజుకి టికెట్లు దొరకడం లేదని డల్లాస్ లోని తెలుగువాళ్లు వాపోతున్నారు.
సాధారణంగా వర్కింగ్ డేస్ లో సినిమాల జోలికి అమెరికాలోని వాళ్లు వెళ్లరు. అటువంటిది డిసెంబర్ 4 వ తేదీ మ్యాట్నీ షోకి టికెట్లు లెకుండా పోయాయని మేరిల్యాండ్ లో ఉండే ఓ తెలుగు ప్రముఖుడు చెప్పారు. ఒక్కో టికెట్ 30 డాలర్లుగా ఉందని, అయినా టికెట్లు లేవన్నారు ఆయన.
న్యూయార్క్, హ్యూస్టన్, ఆస్టిన్, ఫ్లోరిడా, కనెక్టికట్ తదితర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
పుష్ప 1 రిలీజ్ అయినపుడు న్యూయార్క్ మేయర్ కు కూడా ఆసినిమా చూపించారు మనవాళ్లు. అంతటితో ఆగకుండా ఆయనతో కూడా తగ్గేదేలే అనిపించారు. ఇప్పుడు పుష్ప 2 హడావిడి అంతకన్నా ఎక్కువగా ఉందన్నారు.
అల్లు అర్జున్, రశ్మిక హిరోహిరోయిన్లుగా, పహాద్ ఫాసిల్ ప్రతినాయకునిగా నటిస్తున్న ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.
‘పుష్ప ది రైజ్‌’కు కొనసాగింపు ఇది. ‘కిస్సిక్‌’ అనే స్పెషల్‌ సాంగ్‌ కోసం శ్రీలీల వర్క్‌ చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నారు. సుకుమార్‌ - అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో వస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. అభిమానుల ఇష్టాన్ని గుర్తించిన టీమ్‌.. ముందు అనుకున్న సమయం కంటే ఒక్క రోజు ముందుగా డిసెంబర్‌ 5న దీనిని విడుదల చేస్తున్నామని ప్రకటించింది. నవంబర్ 17న ట్రైలర్ రిలీజ్ అయింది.
Read More
Next Story