పీఎస్‌ఎల్వీ సీ-59 రాకెట్ ప్రయోగం వాయిదా.!
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కమర్షియల్ రాకెట్ ప్రయోగం ఆఖరి నిమిషంలో నిలిచిపోయింది. బుధవారం పీఎస్‌ఎల్వీ సీ-59 రాకెట్ ప్రయోగం వాయిదా పడింది. ప్రోబా-3 ఉపగ్రహంలో సాంకేతిక లోపం గుర్తించడంతో పీఎస్‌ఎల్వీ సీ-59 రాకెట్ ప్రయోగాన్ని వాయిదా వేసినట్లు ఇస్రో భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ వెల్లడించింది. రాకెట్ ప్రయోగానికి ముందు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రోబా ఉపగ్రహంలో సమస్యను గుర్తించింది. దీంతో చివరి నిమిషంలో రాకెట్ ప్రయోగాన్ని నిలిపివేశారు. తిరిగి రేపు సా.4:12కు PSLV C-59 రాకెట్ ప్రయోగం జరగనుంది వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం- షార్‌లో ఈ రోజు బుధవారం సాయంత్రం 4 గంటల 08 నిమిషాలకు పీఎస్ఎల్వీ-సీ59 రాకెట్ ప్రయోగాన్ని నిర్వహించనున్నట్లు ఇస్రో వెల్లడించింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3 ఉపగ్రహాన్ని ఈ రాకెట్ కక్ష్యలోకి చేర్చనున్నట్లు తెలిపింది. సరిగ్గా ప్రయోగానికి ముందు ప్రోబాలో సాంకేతిక లోపం ఉన్నట్లు గుర్తించడంతో. దీనిని గురువారానికి వాయిదా వేశారు. గురువారం సాయంత్రం 4.12 నిమిషాలకు ప్రయోగం నిర్వహించనున్నారు.