ఆసుపత్రిలో చేరిన ప్రముఖ గాయని సుశీల
x

ఆసుపత్రిలో చేరిన ప్రముఖ గాయని సుశీల

రెండు వాదనలు వినిపిస్తుండటంతో సుశీల ఆసుపత్రిలో చేరటానికి అసలు కారణం ఏమిటన్న విషయంపై క్లారిటి లేదు.


ప్రముఖ నేపథ్యగాయని పీ సుశీల ఆసుపత్రిలో చేరారు. తీవ్ర అనారోగ్యం కారణంగా శనివారం రాత్రి చెన్నై, ఆళ్వారుపేటలోని కావేరి ఆసుపత్రిలో సుశీల చేరారు. ఆసుపత్రి వర్గాలేమో సుశీల కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నట్లు చెబుతుంటే కుటుంబ సభ్యులేమో కడుపునొప్పిగా కొద్దిరోజులుగా ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. రెండు వాదనలు వినిపిస్తుండటంతో సుశీల ఆసుపత్రిలో చేరటానికి అసలు కారణం ఏమిటన్న విషయంపై క్లారిటి లేదు. ప్రముఖ గాయని ఆసుపత్రిలో చేరారన్న విషయం తెలుసుకుని ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడతో పాటు ఇతర భాషల్లోని సినిమా, ప్రైవేటు పాటలు సుశీల సుమారు 45 వేల పాటలు పాడారు.

86 ఏళ్ళ వయసున్న గాయని దాదాపు ఐదు దశాబ్దాల పాటు సంగీత ప్రపంచాన్ని ఏలారు. ఈమెకు పోటీగా ఎంతమంది గాయనీమణులున్నా సుశీలకు అభిమానుల్లో ప్రత్యేక స్ధానముంది. వివిధ కారణాలతో కొంతకాలంగా సుశీల పాటలకు దూరంగా ఉంటున్నారు. సినిమాల్లో పాటలు పాడటం మానేసిన తర్వాత అప్పుడప్పుడు ప్రైవేటు ఫంక్షన్లలో పాడినా తర్వాత అది కూడా నిలిపేశారు. ఇఫుడు పూర్తిగా ఇంటికే పరిమితమైపోయి విశ్రాంతి తీసుకుంటున్నారు. సన్నిహితులు, బంధువులను మాత్రం కలుస్తున్నారంతే. వయసురీత్యా మొదలైన అనారోగ్యం మినహా ఇంకే సమస్యలు లేవని ఆమెకు సన్నిహితవర్గాలు చెప్పాయి. అలాంటిది సడెన్ గా శనివారం రాత్రి గాయని ఆసుపత్రిలో చేరారన్న విషయం తెలియగానే అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

Read More
Next Story