
మల్లన్న సేవలో తరిస్తున్న ప్రధాని మోదీ
శివాజీ స్పూర్తి కేంద్రాన్ని మోదీ దర్శించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలం క్షేత్రానికి వెళ్లి మల్లన్నను దర్శించుకున్నారు. శ్రీశైలం దేవాలయం అర్చకులు, అధికారులు ప్రధాని మోదీకి లాంఛనంగా పూర్ణకుంభ ఘనస్వాగతం పలికారు. శ్రీశైలం దేవాలయంలోని భ్రమరాంబ, మల్లికార్జున స్వామి వార్లకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక పూజలు చేశారు. శ్రీశైలం మల్లికార్జున స్వామి వార్లకు పంచామృతాలతో మోదీ రుద్రాభిషేకం, భ్రమరాంబదేవికి ఖడ్గమాల, కుంకుమార్చన వంటి ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వార్లకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అక్కడే ఉన్న శివాజీ స్పూర్తి కేంద్రాన్ని మోదీ దర్శించుకున్నారు. శ్రీశైలం దేవాలంయలోని శివాజీ దర్బార్ హాలు, ధ్యాన మందిరాలను మోదీ తిలకించారు. ప్రధాని మోదీతో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు కూడా మల్లన్నస్వామి వార్లను దర్శించుకున్నారు.
అంతకు ముందు ఆయన ప్రత్యేక విమానంలో కర్నూలు జిల్లా ఓర్వకల్లులోని విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్, ఇతరు ఘనస్వాగతం పలికారు. అనంతరం అక్కడ నుంచి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లతో కలిసి ఒకే హెలికాప్టర్‌లో శ్రీశైలం వెళ్లారు. ప్రధాని మోదీ రాక సందర్భంగా సున్నిపెంట వద్ద దాదాపు 1500 మందితో భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
Next Story