
వెయిటింగ్ ఐఏఎస్ లకు పోస్టింగ్ లు
జనరల్ అడ్మినిస్ట్రేషన్ లో ఉండి పోస్టింగ్ ల కోసం ఎదురు చూస్తున్న ఐఏఎస్ అధికారులకు ప్రభుత్వం బుధవారం పోస్టింగ్ లు ఇచ్చింది.
వెయిటింగ్ లో ఉన్న ఏడుగ్గురు ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్ లు ఇస్తూ ఏపీ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ కె విజయానంద్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో ఒకరు సీనియర్ కాగా ముగ్గరు 2021 బ్యాచ్ కు చెందిన వారు. మరో ముగ్గరు 2022 బ్యాచ్ కు చెందిన వారు.
రోనాంకి కుర్మనాథ్, I.A.S (2016), పోస్టు కోసం వెయిటింగ్ లో ఉన్నారు. ఈయనను సర్వే సెటిల్‌మెంట్స్ & ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ గా ప్రభుత్వం నియమించింది. ఇప్పటి వరకు అక్కడ పనిచేస్తున్నN. ప్రభాకర రెడ్డి I.A.S (2013)ని రిలీవ్ చేశారు.
Y. మేఘ స్వరూప్, I.A.S (2021), పోస్టు కోసం వెయిటింగ్ లో ఉన్నారు. ఈయనను ఈస్ట్ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ & అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ గా నియమించారు. అక్కడ ఇప్పటి వరకు ఉన్న S. చిన్న రాముడు, I.A.S (2018)ను అక్కడి నుంచి రిలీవ్ చేశారు.
అశుతోష్ శ్రీవాస్తవ I.A.S (2021), జీఏడీలో వెయిటింగ్ లో ఉన్నారు. పోస్టు కోసం ఎదురు చూస్తున్న ఈయనను గుంటూరు జాయింట్ కలెక్టర్ & అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ గా ప్రభుత్వం నియమించింది. అక్కడ ఇప్పటి వరకు పనిచేస్తున్న అమిలినేని భర్గవ తేజ I.A.S (2018) ను బదిలీ చేసింది.
C యశ్వంత్‌కుమార్ రెడ్డి, I.A.S (2021), పోస్టు కోసం వెయిటింగ్ లో ఉన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా జాయింట్ కలెక్టర్ & అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ పోస్ట్‌లో నియమించారు. ఇప్పటి వరకు ఈ పోస్టులో పనిచేస్తున్న షోభికా S.S., I.A.S (2020) బదిలీ చేసి, పార్వతీపురం ITDA ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టులో నియమించారు.
తిరుమని శ్రీ పూజ, I.A.S (2022), పోస్టింగ్ కోసం వెయిటింగ్ లో ఉన్నారు. ఆమెను పాడేరు అల్లూరి సీతా రామరాజు జిల్లా ITDA ప్రాజెక్ట్ ఆఫీసర్ గా నియమిస్తూ ఆదేశాలు ఇచ్చారు.
కల్పశ్రీ K.R, I.A.S (2022), పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈమెను జాయింట్ సెక్రటరీ (విజిలెన్స్), ఆఫీస్ ఆఫ్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ పోస్ట్‌కు పోస్ట్ చేశారు.
బచ్చు స్మరణ్ రాజ్, I.A.S (2022), పోస్టు కోసం వెయింటింగ్ లో ఉన్నారు. ఈయనను రంపచోడవరం ITDA ప్రాజెక్ట్ ఆఫీసర్ గా నియమించారు. ఇక్కడ ఇప్పటి వరకు పనిచేస్తున్న కట్టా సింహాచలం, I.A.S (2019)ను బదిలీ చేశారు. బదిలీ అయిన వారిలో పోస్టింగ్ లు అందని వారు ఉంటే వారు జీఏడీలో రిపోర్టు చేయాలని సీఎస్ ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు.