జెత్వాని కేసు.. విద్యాసాగర్‌ రిమాండ్ రిపోర్ట్‌లో ఐపీఎస్‌ల పేర్లు
x

జెత్వాని కేసు.. విద్యాసాగర్‌ రిమాండ్ రిపోర్ట్‌లో ఐపీఎస్‌ల పేర్లు

ముంబై నటి కాదంబరి జెత్వాని కేసులో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌కు రిమాండ్ విధించారు. ఈ కేసు రోజుకో మలుపు తీసుకుంటుంది.


ముంబై నటి కాదంబరి జెత్వాని కేసులో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌కు రిమాండ్ విధించారు. ఈ కేసు రోజుకో మలుపు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే ఈ కేసులో సంబంధం ఉన్న ఐపీఎస్ అధికారులను పేర్లను పోలీసులు.. నిందితుల జాబితాలోకి మార్చారు. కుక్కల విద్యాసాగర్‌ రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్న నిందితుల జాబితాలో ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్ గున్ని, కాంతిరాణా తాతా పేర్లు కూడా ఉన్నాయి. ఐపీఎస్ అధికారులను నిందితుల జాబితాలో చేర్చడం ప్రస్తుతం కీలకంగా మారింది. జెత్వాని కేసులో వీరు ముగ్గురూ అత్యంత కీలకంగా వ్యవహరించారని పోలీసులు తమ రిపోర్ట్‌లో వివరించారు. తనపై కేసు నమోదైనట్లు తెలిసిన క్షణం నుంచి కుక్కల విద్యాసాగర్ పరారీలో ఉన్నారు. తీవ్ర గాలింపులు తర్వాత ఆయనను అదుపులోకి తసీుకుని కోర్టు ముందు హాజరుపరచగా అతనికి రిమాండ్ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

అక్టోబర్ 4 వరకు రిమాండ్..

పరారైన వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్.. తన స్నేహితుడి ఫోన్ వాడుతున్నాడని పోలీసులు గుర్తించారు. పక్కా సమాచారంతో డెహ్రాడూన్‌లో ఉన్న విద్యాసాగర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం రాత్రి అతనిని రైలులో.. విజయవాడకు తీసుకొచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ పరీక్షలు చేయించి తెల్లవారుజాము 4 గంటల సమయంలో విజయవాడ 4వ ఏసీఎంఎం జడ్జి ఇంటికి తీసుకెళ్లారు. జడ్జి ముందు హాజరుపరచగా విద్యాసాగర్‌కు న్యాయమూర్తి.. అక్టోబర్ 4 వరకు రిమాండ్ విధించారు. ఈ మేరకు న్యాయమూర్తికి అందించిన విద్యాసాగర్ రిమాండ్ రిపోర్ట్‌లో ఐపీఎస్ అధికారులు ఆంజనేయులు, విశాల్ గున్నీ, కాంతిరాణా తాతా పేర్లను కూడా నిందితులుగా ఉంచారు పోలీసులు.

కుమ్మక్కయ్యే వేధింపులు..

ముంబై నటి జెత్వానీ వేధింపుల కేసులో విద్యాసాగర్, ఐపీఎస్ అధికారులు కుమ్మక్కయ్యారని పోలీసులు తమ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే రిమాండ్ రిపోర్ట్‌లో పీఎస్ఆర్ ఆంజనేయులును ఏ2గా, కాంతిరాణాను ఏ3, విశాల్ గున్నీని ఏ4గా చేర్చనట్లు పోలీసులు స్పష్టం చేశారు. వీరంతా కూడబలుక్కునే జెత్వానీని అక్రమంగా అరెస్ట్ చేశారని పోలీసులు తెలిపారు. కాగా ఈ కేసులో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు పోలీసుల అధికారులను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కేసు తేలే వరకు వారికి పోస్టింగ్ ఉండదని వెల్లడించింది.

Read More
Next Story