ఎంపీ అవినాష్‌రెడ్డి పీఏని విచారిస్తున్న పోలీసులు
x

ఎంపీ అవినాష్‌రెడ్డి పీఏని విచారిస్తున్న పోలీసులు

వైసీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలపై కేసుల నమోదు, విచారణ ప్రక్రియ ఏపీలో హాట్‌ టాపిక్‌గా మారింది.


వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు, కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డిని ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. ఈ రోజు ఉదయం పోలీసుల విచారణకు రాఘవరెడ్డి హాజరయ్యారు. ప్రస్తుతం కడప పోలీసు స్టేషన్‌లో డీఎస్పీ మురళీ నాయక్‌ ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది. అయితే ఈ విచారణలో అవినాష్‌ రెడ్డి పీఏ రాఘవరెడ్డి ఏలాంటి విషయాలను వెల్లడిస్తారు? పోలీసుల టార్గెట్‌ ఏంటి? అనేదానిపై ఆసక్తి నెలకొంది. వైఎస్‌ఆర్‌సీపీ సోషల్‌ మీడియా కర్యకర్త వర్రా రాఘవరెడ్డి కేసులో అవినాష్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వర్రా పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం మేరకు రాఘవరెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు రాఘవరెడ్డికి 41ఏ నోటీసులు ఇచ్చారు. వైఎస్‌ వివాకానందరెడ్డి కుమార్తె వైఎస్‌ సునీత, ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల, వైఎస్‌ఆర్‌ సతీమణి వైఎస్‌ విజయమ్మలపై సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టులో పెట్టడంలో రాఘవరెడ్డి పాత్ర ఉందని, రాఘవరెడ్డి ఆదేశాల మేరకే వర్రా రవీందరరెడ్డి వారిపైన సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారనే ఆరోపణలు రాఘవరెడ్డిపై ఉన్నాయి. ఈ నేపథ్యంలో నోటీసులు అందుకున్న రాఘవరెడ్డి సోమవారం విచారణ నిమిత్తం కడప సైబర్‌ క్రైమ్‌ పోలీసు స్టేషన్‌కు హాజరయ్యాడు.


Read More
Next Story