హరీష్ రావు అరెస్టు
x

హరీష్ రావు అరెస్టు

బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీమంత్రి హరీష్ రావు తదితరులను పోలీసులు అరెస్టుచేశారు.


బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీమంత్రి హరీష్ రావు తదితరులను పోలీసులు అరెస్టుచేశారు. బీఆర్ఎస్ ఫిరాయింపు ఎంఎల్ఏ అరెకపూడి గాంధీని వెంటనే అరెస్టుచేయాలనే డిమాండుతో ఎంఎల్ఏలు హరీష్ రావు, పాడి కౌశిక్ రెడ్డి, పల్లా రాజేశ్వరరావు, వేముల ప్రశాంత్ రెడ్డి తదితరులు సైబరాబాద్ పోలీసు కమీషనర్ కార్యాలయంలో నానా రచ్చచేశారు. గాంధీని వెంటనే ఎందుకు అరెస్టుచేయరంటు పాడితో పాటు ఆయన మద్దతుదారులు సీపీ కార్యాలయంలో నానా రబస సృష్టించారు. దాంతో హరీష్, పాడి, పల్లా తదితరులపై పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్టు కూడా చేశారు. మొదట్లో వీళ్ళందరినీ శంషాబాద్ పోలీసు స్టేషన్ కు తరలించిన పోలీసులు ఆ తర్వాత మూడు బృందాలుగా విడిదీశారు.

అరెస్టుచేసిన వారిని మూడు బృందాలుగా విడదీసి మూడు పోలీసు బృందాలు నగరంలోని మూడు దిక్కుల్లో తిప్పుతున్నారు. ఏ గ్రూపును పోలీసులు ఎటువైపు తిప్పుతున్నారో పార్టీ నేతలకు అర్ధంకావటంలేదు. బీఆర్ఎస్ నేతల, క్యాడర్ ఎలాంటి గొడవలు చేయకుండానే ముందుజాగ్రత్తగా పోలీసులు అరెస్టుచేసిన వారిని మూడు దిక్కుల్లో తిప్పుతున్నట్లు సమాచారం. దాడి చేసింది బీఆర్ఎస్ ఫిరాయింపు ఎంఎల్ఏ అరెకపూడి గాంధీనే అయినా వెనుకుండి దాడి చేయించింది రేవంత్ రెడ్డే అని హరీష్ పదేపదే ఆరోపిస్తున్నారు. రేవంత్ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి రాష్ట్ర ఇమేజి దారుణంగా పడిపోయిందన్నారు. శాంతిభద్రతలు అమల్లో లేదన్నారు. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ టార్గెట్ గా ప్రభుత్వం మద్దతుతో కాంగ్రెస్ గూండాలు దాడులు చేస్తున్న విషయం రాష్ట్రమంతా చూస్తోందన్నారు.

ఒకవైపు రేవంత్ ను పదేపదే టార్గెట్ చేస్తుండటం, మరోవైపు సైబరాబాద్ సీపీ కార్యాలయంలో నానా గోల చేస్తుండటంతో పోలీసులు హరీష్ తదితరులపై కేసులు నమోదుచేసి అరెస్టులు చేసి నగరంలో తిప్పుతున్నారు. దీనికంతటికీ ప్రధాన కారణం ఉదయం నుండి పాడి కౌశిక్ రెడ్డి-గాంధీ మధ్య జరిగిన గొడవే కారణం. పాడి ఇంటికి గాంధీ తన మద్దతుదారులతో వెళ్ళి నానా తిట్లు తిట్టటంతో పాటు ఇంటిపై దాడిలు చేయించారు. పాడి ఇంటిపైకి గాంధీ మద్దతుదారులు రాళ్ళు, కోడిగుడ్లు, టమోటాలు, కర్రలతో దాడులు చేశారు. తర్వాత పోలీసులు రెండు వర్గాలను చెదరగొట్టారు.

ఆ తర్వాత కాసేపటికి పాడి, హరీష్, వేముల, పల్లా తదితరులు సైబరాబాద్ సీపీ కార్యాలయం దగ్గరకు చేరుకుని గోల మొదలుపెట్టారు. దాంతో పోలీసులు ఎంతచెప్పినా వీళ్ళు వినకుండా గోలను కంటిన్యు చేస్తుండటంతో వేరేదారిలేక పోలీసులు కేసులు నమోదుచేసి అరెస్టులు చేశారు.

Read More
Next Story