
ప్రాణం తీసిన పేకాట
పోలీసుల నుంచి తప్పించుకునేందుకు కృష్ణా నదిలోకి దూకి ప్రాణాలు తీసుకున్నాడు.
ఓ వ్యక్తి అకారణంగా తన ప్రాణాలను తానే తీసుకున్నాడు. కుటుంబ సమస్యలు లేవు. అప్పులు బాధలు లేవు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు కృష్ణా నదిలో దూకాడు. కానీ బయట పడలేక పోయాడు. మృత్యువాత పడ్డాడు. దీంతో అతని కుటుంబం అనాధగా మారింది. భార్య పిల్లలు అనాధలుగా మారారు. కృష్ణా జిల్లాలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం రొయ్యూరుకు సమీపంలోని లంక భూముల్లో కొంత మంది వ్యక్తులు పేకాట జూదంకు అలవాటు పడ్డారు. పేకాట ఆడుతున్నారనే సమాచారం పోలీసులకు అందింది. పేకాట రాయుళ్లను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. స్థావరం వద్దకు వెళ్లారు. పోలీసులు వచ్చారనే విషయాన్ని గమనించిన పేకాటరాయుళ్లు భయపడి అక్కడ నుంచి పరుగులు తీశారు. ఈ నేపథ్యంలో పేకాటరాయుళ్లు ఒడుగు వెంకటేశ్వరరావు, వల్లభనేని గోపాలరావులు పక్కనే ఉన్న కృష్ణా నదిలోకి దూకారు. అవతికి చేరుకునేందుకు ప్రయత్నించారు.
అయితే కృష్ణానదిలోకి దూకిన పేకాట రాయుళ్లలో ఒడుగు వెంకటేశ్వరరావు కృష్ణానదిలో ఈదుకుంటూ సేఫ్‌గానే అవతలి ఒడ్డుకు చేరుకున్నాడు. ఇతనితో పాటు కృష్ణాలోకి దూకిన వల్లభనేని గోపాలరావు మాత్రం ఈదలేక పోయాడు. కృష్ణా నదిలో మునిగి పోయాడు. దీనిని గమనించిన స్థానిక యువకులు అప్రమత్తమయ్యారు. కృష్ణా నదిలోకి దిగి మునిగి పోయిన గోపాలరావును బయటకు తీశారు. అయితే అప్పటికే ఆ వ్యక్తి మరణించాడు. గోపాలరావు మరణించాడనే విషయం తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు పెద్దన సంఘటన స్థలానికి చేరుకున్నారు. గోపాలరావు చనిపోవడాన్ని జీర్ణించుకోలేక కన్నీరుమున్నీరయ్యారు. అకారణంగా మరణించిన గోపాలరావుకు భార్య పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story