ఆరుద్ర నిబద్ధత గల కవి : తెలకపల్లి రవి
x

ఆరుద్ర నిబద్ధత గల కవి : తెలకపల్లి రవి

విజయవాడలో ఆరుద్ర ఆరుద్ర శతజయంతి సభ


సాహిత్యరంగం లో నిబద్ధత గల కవి ఆరుద్ర అని చరిత్రను, సాహిత్యానికి ఎలా అన్వయించాలో తెలిసిన ప్రతిభావంతులని సాహితీ స్రవంతి గౌరవాధ్యక్షులు, సాహిత్య ప్రస్థానం ప్రధాన సంపాదకులు తెలకపల్లి రవి అన్నారు.


సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో విజయవాడ లోని బాలోత్సవ భవన్ లో శుక్రవారం రాత్రి ఆరుద్ర శతజయంతి ప్రారంభ సభ రాష్ట్ర అధ్యక్షులు కెంగార మోహన్ సభాద్యక్షతన జరిగింది. సభను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే సత్యరంజన్ ప్రారంభించారు.


ప్రధాన వక్త గా హాజరైన తెలకపల్లి రవి మాట్లాడుతూ కృత్రిమ మైన చింతలో పుట్టినకవి చింతే ఉంటుందన్నారు. సామ్యవాద భావుకుడు గా ఆరుద్ర సాహిత్య లోకం లో చెరగని ముద్ర వేశాడన్నారు. కొత్త ప్రతీకలు తీసుకుని మార్కిసిస్ట్ దృక్పథం లో చూశాడాన్నారు. ప్రతిభ ప్రయోగశీలత కలిగిన కవి ఆరుద్ర అన్నారు. మొదటి కావ్యం తోనే ఆరుద్ర అభ్యుదయ కాంక్ష కన బడుతుందన్నారు.


అధ్యక్షులు కెంగారమోహన్ మాట్లాడుతూ శాస్త్రీయ సామ్యవాద సిద్దాంతాల వెలుగు లో పరిశీలించి కొత్త విషయాలను గుర్తించి ఒకనాటి సనాతన ధర్మం ఏమిటో అర్థం చేసుకోవాలని ఆరుద్ర యేనాడో చెప్పాడన్నారు. కాలం ఒక తేలని ప్రశ్న, కాలం ఒక తీరని తృష్ణ అని గొప్ప కవిత్వాన్ని సృష్టించారన్నారు. ఆరుద్ర ప్రయోగ శీలి అని అన్నారు. సినీ కవిగా దాదాపు వేల పాటలు రాశారని తరతరాలు నిలిచి పోయే పాటలు రాశాడన్నారు.


శాసన మండలి మాజీ సభ్యులు ఎంవీయస్ శర్మ మాట్లాడుతూ ఆరుద్ర సాహిత్యంపై సంవత్సరం పాటు నిర్వహిస్తున్నామన్నారు. పాలకులే ఈ సమాజాన్ని పక్కదారి పట్టిస్తున్న సమయం లో భావాల ద్వారా ప్రతిఘటించాల్సిన అవసరం కవులపై ఉందన్నారు. దేశం సంక్లిష్ట స్థితిలో కవులపాత్ర శక్తి వంతంగా వుండాలన్నారు.


సభలో సాహితీ స్రవంతి మాజీ రాష్ట్ర అధ్యక్షులు వొరప్రసాద్, సాహిత్య ప్రస్థానం వర్కింగ్ ఎడిటర్ సత్యాజీ, శాంతిశ్రీ, జాషువా విజ్ఞానకేంద్రం బాధ్యులు నారాయణ, పీయస్ బీ హెచ్ లక్ష్మయ్య, కవి వైష్ణవి శ్రీ, కే ఎక్స్ రాజు, గోళ్ళ నారాయణ రావు, డీ వై ఎఫ్ ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న ప్రజానాట్యమండలి నాయకులు నాయకులు అనిల్ తదితరులు హాజరయ్యారు


Read More
Next Story