
ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రంలో ధ్యానం చేసిన మోదీ
శ్రీశైలంలోని ఛత్రపతి శివాజీ స్పూర్తి కేంద్రాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం మద్యాహ్నం సందర్శించి శివాజీ మహరాజ్ కు నివాళులర్పించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా గురువారం శ్రీశైలంలోని శ్రీ చత్రపతి శివాజీ మహారాజు స్ఫూర్తి కేంద్రం (ధ్యాన మందిరం లేదా శివాజీ మెమోరియల్)ను సందర్శించుకున్నారు. ఇది చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన స్థలం. ముందు ఉదయం 11:15 గంటలకు శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, దర్శనం చేసుకున్న తర్వాత ఈ కేంద్రానికి వెళ్లారు.
ధ్యాన కేంద్రంలో గోడలపై చిత్రాలు పరిశీలిస్తున్న ప్రధాని మోదీ
ధ్యాన కేంద్రంలోని ధ్యాన మందిరం (మెడిటేషన్ హాల్)లో ప్రధాని సుమారు 15-20 నిమిషాల పాటు అన్నీ తిరిటి పరిశీలించారు. ఇక్కడ లోతైన ధ్యానంలో శివాజీ మహారాజు విగ్రహం మధ్యలో ఉంది. కేంద్రంలోని చారిత్రక ప్రదర్శనలు, మోడల్స్‌ను పరిశీలించారు. గోడలపై చెక్కిన శిల్పాలను పరిశీలించారు. ధ్యానకేంద్రం ఇన్చార్జ్ నాగేశ్వరరావు ప్రధాన మంత్రి మోదీకి ధ్యానకేంద్రం గొప్పతనం గురించి వివరించారు. ధ్యాన కేంద్రంలో కొద్దిసేపు పీఎం మోదీ ధ్యానం చేశారు.
ధ్యాన మందిరంలో కొద్దిసేపు ధ్యానం చేసిన పీఎం మోదీ
శివాజీ మహారాజు ఆసీనులైన ప్రదేశం, ఎదురుగా మంత్రులు ఆసీనులైనట్లు చెక్కిన శిల్పాలను ప్రధాన మంత్రి తదేకంగా పరిశీలించారు. ఛత్రపతి శివాజీ విగ్రహానికి ప్రధాన మంత్రి మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. శివాజీ ట్రస్ట్ నిర్వాహకులను ఈ సందర్భంగా ప్రధాని మోదీ అభినందించారు. నిర్వహణ చాలా బాగుందని ప్రశంసించారు.
శివాజీ స్పూర్తి కేంద్రంలో కుడ్య చిత్రాలు
శివాజీ మహారాజు 1677లో శ్రీశైలం సందర్శించిన సందర్భాన్ని గుర్తుచేసుకునేందుకు ఈ కేంద్రం నిర్మించారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఇతర అధికారులు ప్రధానితో కలిసి పాల్గొన్నారు.
జ్ఞాపిక ను అందుకుంటున్న ప్రధాని మోదీ
భారీ భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణలు జరిగాయి. స్థానికులు, భక్తులు ప్రధాని సందర్శనకు స్వాగతం పలికారు.
శ్రీ శివాజీ మెమోరియల్ కమిటీ చేత నిర్మించబడింది. శివాజీ మహారాజు జీవిత చరిత్ర, స్వాతంత్ర్య సమరయోధుడిగా సేవలను ప్రదర్శిస్తుంది. మధ్యలో శివాజీ విగ్రహం. చుట్టూ ప్రతాపగఢ్, రాజ్‌గఢ్, రాయ్‌గఢ్, శివనేరి వంటి నాలుగు చారిత్రక కోటల మోడల్స్ ఉన్నాయి.
శివాజీ మహరాజ్ సింహాసనం
శ్రీ భ్రమరాంబా దేవి శివాజీకి యుద్ధానికి ఖడ్గం ఇచ్చిన సంఘటనను స్మరించుకుంటుంది. మరాఠా సామ్రాజ్య నాయకుడిగా శివాజీ ఆధ్యాత్మిక సంబంధాన్ని హైలైట్ చేస్తుంది.
ధ్యాన కేంద్రం వద్ద ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిగిన ఫొటో
ఈ సందర్శన శివాజీ వారసత్వాన్ని గౌరవించడానికి, హిందూ సంస్కృతి-చరిత్రను ప్రోత్సహించడానికి జరిగింది. ఈ సందర్శన దేశవ్యాప్తంగా శివాజీ భక్తులలో ఆనందాన్ని రేకెత్తించింది. శివాజీ స్పూర్తి కేంద్రాన్ని సందర్శించుకున్న అనంతరం ఆయన మద్యాహ్నం 1 గంట తరువాత శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి గెస్ట్ హౌస్ కు బయలుదేరి వెళ్లారు.