ఎన్టీఆర్‌పై మోదీ పొగడ్తల వర్షం
x

ఎన్టీఆర్‌పై మోదీ పొగడ్తల వర్షం

నేడు 102వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు ఘన నివాళులు అర్పించారు.


తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అంజలి ఘటించారు. ఆ మేరకు సోషల్‌ మీడియా వేదికగా ఎన్టీఆర్‌కు ప్రధాని మోదీ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మోదీ ఎన్టీఆర్‌పై ఓ రేంజ్‌లో పొగడ్తల వర్షం కురిపించారు. ఆంధ్రప్రదేశ్‌లోని నిరుపేదలు, అణగారిన వర్గాల సాధికారత దిశగా అడుగులు వేశారని, ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి, ఏపీ ప్రజల డెవలప్‌మెంట్‌కు ఎన్టీఆర్‌ చేసిన కృషి అద్భుతమని ప్రధాని మోదీ ప్రశంసించారు. ఆ మేరకు ఎక్స్‌ వేదికగా మోదీ ఓ పోస్టు పెట్టారు.

మోదీ ఏమన్నారంటే..
సమాజంలోని పేదలు, అట్టడుగున ఉన్న వర్గాలకు ఎన్టీఆర్‌ చేసిన సేవలు అమోఘం. వారిని సాధికారత వైపు, అభివృద్ధివైపు ఎన్డీఆర్‌ నడిపించిన తీరు అద్భుతం. ఎన్టీఆర్‌ సినీరంగంలో చరిత్ర సృష్టించారని, ఆయన నటించిన సినిమాలు, ఆయన చేసిన రచనలు, ఆయన తీసిన చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. అంతటి గొప్ప నాయకుడు ఎన్టీఆర్‌ నుంచి మనం ఎంతో ప్రేరణ పొందాం. ఎన్టీఆర్‌ దార్శనికతను నెరవేర్చేందుకు మిత్రులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఆ మేరకు తనకు విశ్వాసం ఉంది. అంతటి గొప్ప వ్యక్తి ఎన్టీఆర్‌కు నివాళులు అర్పిస్తున్నాను. అంటూ ఎక్స్‌ వేదికగా ప్రధాని మోదీ ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కూడా సోషల్‌ మీడియా వేదికగా ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించారు. యుగపురుషుడు, విశ్వవిశాఖ్యాత నటసార్వభౌముడు, తెలుగు వారి ఆరాధ్య దైవం, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు ఎన్టీటీ ఆర్‌ అంటూ నివాళులు అర్పించారు.


Read More
Next Story