తిరుపతి ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి, సంతాపం తెలిపిన అమిత్ షా..
x

Photo source : ANI

తిరుపతి ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి, సంతాపం తెలిపిన అమిత్ షా..

తొక్కిసలాటలో ఐదుగురు చనిపోయారు. వీరిలో ఏపీకి చెందిన వారు ముగ్గురు కాగా, కర్ణాటక, తమిళనాడుకు చెందిన ఇద్దరు భక్తులు ఉన్నారు.


తిరుపతి(Tirupati) సమీపంలో బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాట(Stampede) ఘటనపై ప్రధాని మోదీ (PM Modi) స్పందించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా దిగ్బ్రాంతి వ్యక్తం చేసి, చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తిరుమల వెంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వారా దర్శనానికి టీటీడీ పలుచోట టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

ఘటన దురదృష్టకరం..

"తిరుపతిలో తొక్కిసలాట దురదృష్టకరం. ప్రాణాలు కోల్పోయిన వారికి నా సంతాపం తెలుపుతున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. ఈ ఘటనలో బాధితులందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని విధాల సహాయాన్ని అందిస్తోంది."- అని ప్రధాని మోదీ ఎక్స్‌లో పేర్కొన్నారు.

గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలి..

"తిరుపతిలో తొక్కిసలాట ఘటన నన్ను కలచివేసింది. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ప్రాణాలు కోల్పోయిన భక్తుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా."- అని కేంద్ర మంత్రి అమిత్ (Amit Sha) షా ఎక్స్‌లో స్పందించారు.

మృతుల్లో నలుగురు మహిళలు, ఒక పురుషుడు..

తొక్కిసలాటలో మొత్తం ఐదుగురు చనిపోయారు. వీరిని ఏపీకి చెందిన వారు ముగ్గురు కాగా, కర్ణాటక(Karnataka), తమిళనాడు(Tamilnadu)కు చెందిన ఇద్దరు భక్తులు ఉన్నారు. మృతులను ఏపీలోని నర్సీపట్నానికి చెందిన బుద్దేటి నాయుడుబాబు (51), విశాఖపట్నానికి చెందిన రజిని (47), లావణ్య (40), శాంతి (34), కర్ణాటకలోని బళ్లారికి చెందిన నిర్మల (50) ,తమిళనాడులోని సేలం ప్రాంతానికి చెందిన మల్లిగ (49) గా గుర్తించారు.

Read More
Next Story