
‘భారదేశం అభివృద్ధికి ఆంధ్రా అభివృద్ధి జరగాలి’
రాయలసీమకు ఉద్యోగాలు వస్తాయి, సంపద వస్తుంది
రాయలసీమ కు భారీగా ఉద్యోగాలు వస్తాయని, ఈ ప్రాంతంలో సంపద పెరుగుతుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.
ఈ రోజు కర్నూలు సమీపంలో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ రాయలసీమ అభివృద్ధి లేకుండా ఆంధప్రదేశ్ అభివృద్ధి లేదని ఆయన అన్నారు. " భారతదేశం అభివృద్ధి చెందాలంటే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి. అలాగే రాయలసీమ అభివృద్ధి లేకుండా ఆంధ్ర అభివృద్ధి సాధ్యం కాదు,’’ అని ఆయన్నారు. ఈరోజు కర్నూలు గడ్డమీద మొదలయిన అభివృద్ది కార్యక్రమాలు రాయలసీమ జిల్లాల్లో అన్నిచోట్ల అభివృద్ధి ద్వారాలు తెరుచుకుంటాయి. ఉద్యోగాలు సృష్టిస్తాయి. సంపద సృష్టిస్తుంది అని ఆయన అన్నారు.
ఉయ్యాల వాడ నరసింహారెడ్డి, స్వాతంత్య్ర సంగ్రామ యోధుడు గాడిచర్ల హరిసర్వోత్తమరావుకు పేరు స్మరిస్తూ ప్రధాని ప్రసంగం ప్రారంభించారు.
ఈ ప్రాంతంలో వస్తున్న కొప్పర్తి, ఓర్వకల్ ఇండస్ట్రియల్ కారిడార్లు పెద్ద ఎత్తున ఉద్యోగాలు సృష్టిస్తున్నాయనే నమ్మకం తనకు ఉందని ఆయన అన్నారు. ఈ రెండు కారిడార్లకు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని దీనితో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రధాని చెప్పారు.
ముఖ్యంగా కర్నూలు గురించి మాట్లాడుతు కర్నూలు దేశంలో ఒక పెద్ద డ్రోన్ హబ్ గా మారుతుందని, కర్నూలు పేరు దేశానికి ఆదర్శమవుతందని ప్రధాని అన్నారు.
అయితే, నేటి సభలో రాయలసీమకు ఒక స్పష్టమయిన ఎలాంటి హామీ లేదు. ప్రకటన లేదు.