
ఉగాదికి ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబుల శుభాకాంక్షలు
తెలంగాణ ప్రజలకు ప్రధాని నరేంద్రమోదీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం నారా చంద్రబాబునాయుడు, వైెఎస్ జగన్ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ఉగాది పర్వదినం సందర్భంగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన పంచాంగ శ్రవణ కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,మంత్రులు కందుల దుర్గేష్, ఆనం రామనారాయణరెడ్డిలు పాల్గొన్నారు.
మోదీ ఉగాది శుభాకాంక్షలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉగాది సందర్భంగా తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఇది ఆశ, ఉత్సాహాలతో ముడిపడి ఉన్న ప్రత్యేక పండుగ ఉగాది అని మోదీ పేర్కొన్నారు. ఈ కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందాన్ని, శ్రేయస్సును, విజయాలను తీసుకురావాలని మోదీ ఆకాంక్షించారు. సంతోష, సామరస్యాల స్ఫూర్తి వృద్ధి చెందుతూ మరింతగా వర్ధిల్లాలని మోదీ ఆకాంక్షించారు.
అందరికీ ఉగాది శుభాకాంక్షలు! pic.twitter.com/gFxQkkbn9I
— Narendra Modi (@narendramodi) March 30, 2025
తెలుగువారందరికీ చంద్రబాబు ఉగాది శుభాకాంక్షలు
విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. వచ్చేవన్నీ మంచి రోజులనే సానుకూల దృక్పథంతో కొత్త ఏడాదిని స్వాగతిద్దామని సీఎం పేర్కొన్నారు. ‘‘కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం. మీ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ రాబోయే కాలంలో గణనీయమైన ప్రగతి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’అని చంద్రబాబు ఎక్స్ (ట్విట్టర్) లో పోస్టు పెట్టారు. విశ్వావసు నామ సంవత్సరం తెలుగు ప్రజలందిరిలో సంతోషాన్ని నింపాలని, సకల విజయాలను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు వివరించారు.
విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. వచ్చేవన్నీ మంచి రోజులనే సానుకూల దృక్పథంతో కొత్త ఏడాదిని స్వాగతిస్తాం. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం. మీ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ రాబోయే కాలంలో గణనీయమైన ప్రగతి సాధించాలని మనస్ఫూర్తిగా… pic.twitter.com/TtW5q306vs
— N Chandrababu Naidu (@ncbn) March 30, 2025
వైఎస్ జగన్ ట్వీట్
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది అందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండేలా చూడాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఉగాది పండుగను ఇంటిల్లిపాది ఘనంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాని జగన్ పేర్కొన్నారు.
Next Story