భారతిరెడ్డి నన్నుక్షమించమ్మా..నీ కాళ్లు పట్టుకుంటా ప్లీజ్
x

భారతిరెడ్డి నన్నుక్షమించమ్మా..నీ కాళ్లు పట్టుకుంటా ప్లీజ్

వైఎస్‌ భారతిరెడ్డిపై ఓ ఐటీడీపీ కార్యకర్త అసభ్యకరంగా అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఆపై క్షమించండి అంటూ వీడియో విడుదల చేశాడు.


మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భార్య వైఎస్‌ భారతిరెడ్డిని అవమానిస్తూ, ఆమెను కించపరుస్తూ, ఆమె మీద అసభ్యకరంగా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు చేబ్రోలు కిరణ్‌ అనే ఓ ఐటీడీపీ కార్యకర్తను గుంటూరు నల్లపాడు పోలీసులు అరెస్టు చేశారు. మరో వైపు ఈ ఘటనపై అధికార పక్షమైన తెలుగుదేశం పార్టీ స్పందించింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భార్య వైఎస్‌ భారతిరెడ్డి మీద అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్‌ను తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది. అతనిని అరెస్టు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్‌ వైఎస్‌ భారతిరెడ్డి మీద చేసిన అసభ్యకర వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఇవి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసాయి. దీని మీద వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు దీనిపై భగ్గు మన్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ స్పందించింది. ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్‌ వ్యాఖ్యల మీద టీడీపీ పార్టీ పెద్దలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను కించరచే విధంగా, అగౌరపరిచే విధంగా వ్యాఖ్యలు చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది. మరో వైపు చేబ్రోల్‌ కిరణ్‌ వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్‌ను టీడీపీ నుంచి సస్పెండ్‌ చేసింది. అతని మీద కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించింది. తెలుగుదేశం పార్టీ పెద్దల ఆదేశాల మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. చేబ్రోలు కిరణ్‌ మీద కేసు నమోదు చేశారు. గుంటూరు నల్లపాడు పోలీసులు చేబ్రోలు కిరణ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఇదిలా ఉంటే ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్‌ ఓ వీడియో విడుదల చేశాడు. క్షణికావేశంలో ఇలాంటి అసభ్యకర వ్యాఖ్యలు చేశానని, తనను క్షమించాలని కోరాడు. నేను చాలా తప్పుగా మాట్లాడాను. దయచేసి.. అమ్మా భారతి, జగన్‌మోహన్‌రెడ్డి.. మీ ఇద్దరు కూడా నన్ను క్షమించండి. నిజంగా చేసింది చాలా తప్పు. భారతిరెడ్డి కాళ్లు పట్టుకుని వేడుకుంటున్నా.. నన్ను క్షమించండి. ఆడవాళ్లను ఇలా కించపరచకూడదు. నేను అవమానకరంగా మాట్లాడాను. జీవితంలో ఇలాంటి పొరపాటు మల్లా చేయను. దయచేసి నన్ను క్షమించండి అంటూ ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్‌ ఆ వీడియోలో వేడుకున్నాడు.
Read More
Next Story