మొంథా తుఫాను ముప్పు నుంచి ప్రజలను సురక్షితంగా కాపాడేందుకు ప్రభుత్వం, సీఎం చంద్రబాబు అనేక రకాల చర్యలు చేపట్టారు. విపత్తులు వచ్చినపుడునష్టం నివారించే ప్రణాళిక రూపొందించడంలో చంద్రబాబు కు చాలా పేరుంది. గతంలోఒకసారి ఒరిస్సాలో తుఫాన్ బీభత్సరం సృష్టించనపుడు, ఆయన ఆంధ్రా అధికార సైన్యాన్ని పంపి, సహాయక చర్యలు చేపట్టి ఫని (Fani) నష్టం పెద్దగా లేకుండా చర్యలు తీసుకున్నారు. 2019లోె ఫని ఒరిస్సాలో దాడి చేసింది. అపుడు రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ (Real-Time Governance Society (RTGS) చంద్రబాబు అమరావతి నుంచే పర్యవేక్షణ జరిపారు. దీనితో ఆయన ఒరిస్సా ప్రభుత్వ ప్రశంసలందుకున్నారు. అక్కడి ప్రజల హృదయాలను చూరగొన్నారు. ఇపుడు మోంథా తుఫాన్ వల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం పెద్దగా లేకుండా చేయడంలో ఆయన ప్రణాళిక సక్సెస్ అయింది.
వరుస సమీక్షలు నిర్వహిస్తూ అధికారులకు, మంత్రులు, ప్రజా ప్రతినిధులకు ఎప్పటికప్పుడూ ఆదేశాలు జారీ చేస్తూ ప్రజలకు భరసా కల్పించడంలో సఫలమయ్యారు. ప్రజలను అప్రమత్తం చేస్తూ జాగ్రత్తలు పాటించేలా చర్యలు చేపట్టారు. ఎక్కడ ఎలాంటి నష్టం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. అధికార యంత్రాంగాన్ని, సిబ్బందిని రంగంలోకి దింపారు. ఆయన నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తుఫాన్ నష్ట నివారణ చర్యలివే.
ముందస్తు సహాయక నిధులు: సహాయక చర్యల కోసం ప్రభుత్వం రూ. 19 కోట్లు విడుదల చేసింది.
ప్రత్యేక అధికారుల నియామకం: తుపాను ప్రభావిత జిల్లాల సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించారు.
సమాచార వ్యవస్థ: ప్రజలకు ఎస్ఎంఎస్, వాట్సాప్, సోషల్ మీడియా, ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా నిరంతర హెచ్చరికలు పంపించారు.
అప్రమత్తత: నష్ట నివారణ చర్యల కోసం గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న యంత్రాంగం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిస్థితిని నిరంతరం సమీక్షించారు.
కంట్రోల్ రూమ్ లు : పరిస్థితిని నిరంతరంగా పర్యవేక్షించడానికి, అప్రమత్తంగా ఉండటానికి వీలుగా 24/7 రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) కమాండ్ సెంటర్ ఏర్పాటు చేశారు.
తొలగింపు చర్యలు: తుపాను ప్రభావిత ప్రాంతాల నుంచి దాదాపు 76,000 మందిని, అలాగే 3,465 మంది గర్భిణీ స్త్రీలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారికి పునరావాస కేంద్రాలలో ఆహారం, నీరు వంటి సౌకర్యాలు కల్పించారు.
కరెంటు పునరుద్ధరణ బృందాలు: విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కోసం అదనపు పోల్స్, ట్రాన్స్‌ఫార్మర్‌లు, క్రేన్‌లతో సహా 772 పునరుద్ధరణ బృందాలను సిద్ధంగా ఉంచారు.
రవాణా ఆంక్షలు: తుపాను ప్రభావిత జిల్లాలలో రాత్రిపూట వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు.
సహాయక చర్యలు: సహాయక చర్యల కోసం ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్డిఆర్‌ఎఫ్ బృందాలను మోహరించారు. అలాగే, రోడ్డు క్లియరింగ్ కోసం ఎర్త్‌మూవర్లు, క్రేన్‌లు, చైన్‌సాలను సిద్ధంగా ఉంచారు.
పాఠశాలలకు సెలవులు: ప్రజల భద్రత కోసం పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
రైతుల రక్షణ: రైతు సేవా కేంద్రాల వద్ద రైతుల కోసం తడుపుడు వరిని ఆరబెట్టడానికి, రక్షణ కల్పించడానికి ఏర్పాట్లు చేశారు. యాభై వేల టర్పాల్ పట్టలు సిద్ధంగా ఉంచారు.
వైద్య శిబిరాలు: అత్యవసర వైద్య సహాయం కోసం 219 వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు.
పశువుల దాణా సరఫరా: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పశువుల దాణాకు కొరత లేకుండా 865 టన్నుల దాణాను సిద్ధంగా ఉంచారు. పంట నష్టాన్ని అంచనా వేయడానికి డ్రోన్‌లను ఉపయోగించారు.
76,000 మంది పునరావాస కేంద్రాలకు తరలింపు లు చేపట్టారు. 1,500+ షెల్టర్లు ఏర్పాటు చేశారు. అవసరం మేరకు స్కూళ్లు, హాల్స్ ను వీటికి కోసం వినియోగించారు. ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం, రూ.3,000 నగదు అందజేశారు. ఎపిడెమిక్‌లకు వ్యాక్సిన్లు, మందులు సిద్ధం చేసి, సరఫరా చేశారు. 45 NDRF టీమ్‌లు (బోట్లు, కట్టర్లు) ను రంగంలోకి దింపారు. ఆర్మీ, నేవీ సహాయం కూడా తీసుకున్నారు. ఫలితంగా మొంథా తుపాన్ నుండి ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా చేయగలిగారు.