Case on Telangana Talli Statue|విగ్రహావిష్కరణపై కోర్టులో పిటీషన్
తెలంగాణాతల్లి(Telangana Talli Statue) విగ్రహావిష్కరణను నిలిపేయాలని సరిగ్గా శనివారం మధ్యాహ్నం కోర్టు(High Court)లో పిటీషన్ దాఖలైంది.
తెలంగాణాతల్లి విగ్రహావిష్కరణకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. 9వ తేదీన సచివాలయంలో 20 అడుగుల తెలంగాణాతల్లి విగ్రహాన్ని రేవంత్ రెడ్డి (Revanthreddy)ఆవిష్కరించబోతున్న విషయం తెలిసిందే. విగ్రహావిష్కరణపై ఇటు అధికార కాంగ్రెస్, అటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య మాటల మంటలు రేగుతున్నాయి. విగ్రహావిష్కరణను రేవంత్ ప్రభుత్వం చాలా ప్రతిష్టగా తీసుకుంది. రేవంత్ ప్రభుత్వం ఆవిష్కరించబోతున్న విగ్రహాన్ని తాము అధికారంలోకి రాగానే తీసేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS working president KTR) చేసిన ప్రకటనతో మాటల మంటలు రాజుకుంటున్నాయి.
తెలంగాణాతల్లి(Telangana Talli Statue) విగ్రహావిష్కరణను నిలిపేయాలని సరిగ్గా శనివారం మధ్యాహ్నం కోర్టు(High Court)లో పిటీషన్ దాఖలైంది. జూలూరి గౌరీశంకర్(Juluri Gowri Sankar) ఈ పిటీషన్ను దాఖలు చేశారు. విగ్రహావిష్కరణకు జూలూరికి సంబంధం ఏమిటో ? విగ్రహావిష్కరణపై జూలూరి అభ్యంతరం ఏమిటో కూడా తెలీదు. ఇంతకాలం మౌనంగా ఉన్న జూలూరి విగ్రహావిష్కరణకు 48 గంటల ముందు అభ్యంతరం చెబుతు పిటీషన్ దాఖలు చేయటంలో ఔచిత్యం ఏమిటో అర్ధంకావటంలేదు. జూలూరి దాఖలుచేసిన పిటీషన్ మీద హైకోర్టు ఏమంటుందనే ఆసక్తి సర్వత్రా పెరిగిపోతోంది.