
వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అరెస్ట్
ఎంపీ మిథున్‌రెడ్డి శనివారం ఉదయం సిట్ విచారణకు హాజరయ్యారు.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌పార్టీ నాయకుడు, రాజంపేట సిట్టింగ్ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. శనివారం ఉదయం విజయవాడ సీపీ కార్యాలయంలోని సిట్ విచారణకు ఆయన హాజరయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సిట్ అధికారులు ఆయనను విచారించారు. దాదాపు ఏడు గంటలకుపైగా విచారించిన సిట్ అధికారులు తర్వాత అరెస్టు చేశారు. అక్కడ నుంచి విజయవాడ జీజీహెచ్‌కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అవి పూర్తి అయిన తర్వాత విజయవాడ కోర్టులో హాజరు పరచనున్నారు. అక్కడ నుంచి విజయవాడకు తరలించే అవకాశాలు ఉన్నట్లు పోలీసు వర్గాలు చర్చించుకుంటున్నారు.
ఎంపీ మిథున్‌రెడ్డిని మద్యం కుంభకోణం కేసులో ఏ–4 నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో తనను అరెస్టు చేస్తారనే ఆలోచనలతో ముందస్తు బెయిల్ కోసం తొలుత ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ మిథున్‌రెడ్డికి చుక్కెదురైంది. తర్వాత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్‌ను మంజూరు చేయాలని పిటీషన్ దాఖలు చేశారు. అక్కడ కూడా బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. అన్ని దార్లు మూసుకొని పోవడంతో సిట్ విచారణకు హాజరు కావాలని మిథున్‌రెడ్డి నిర్ణయించుకున్నారు. దీంతో శనివారం విజయవాడ సిట్ కార్యాలయానికి వచ్చారు. దాదాపు ఏడు గంటలకుపైగా విచారించిన సిట్ అధికారులు మిథున్‌రెడ్డిని అరెస్టు చేశారు.
Next Story