తమిళనాడు రుపాయి సింబల్ హిందీనుంచి తమిళంలోకి మార్చడం మీద జనసేన తనే అసంతృప్తి వ్యక్తంచేశారు.
తమిళనాడు ప్రభుత్వం రుపాయి సింబల్ మార్చి తమిళలో రాసిందని చెబుతూ అది వివేచన ఆలోచన తో చేసిన పని కాదన్నారు.అసమ్మతి వ్యక్తం చేశారు. అదే విధంగా డిలీమిటేషన్ ను వ్యతిరేకిస్తుండటాన్ని కూడా యన ప్రస్తావించారు. “డీలిమిటేషన్ అంటున్నారు. డీలిమిటేషన్ వస్తే దక్షిణాదిలో లోక్ సభ సీట్లు తగ్గిపోతున్నాయని చెబుతున్నారు. అసలు తగ్గిపోతాయో లేదో మొదట చర్చ జరగాలి,’’ పవన్ అన్నారు. అంతే తప్ప డీలిమిటేషన్ పేరు చెప్పి “ నేను రుపాయి సింబల్ మార్చేస్తాను, నాభాషలో రాస్తాను అంటే అపుడ మేం తెలుగులో పెట్టాలి, కన్నడ వాళ్లు కన్నడంలో పెట్టాలి. గుజరాత్ వాళ్లు గుజరాతీలో రాస్తారు. మహారాష్ట్ర వాళ్లు మహారాష్ట్రలో రాస్తారు. దేనికైనా ఒక ఆలోచన వివేచన ఉండనవసరం లేదా?”అని అన్నారు. ఉన్నత పదవుల్లో వున్నవాళ్లు చాలా ఆలోచించి ఏపైనైనా చేయాలని, వాళ్ల మాటలు చాల ప్రభావితం చేస్తాయని ఆయన పరోక్షంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కు హెచ్చరిక చేశారు. ఒకటి విధ్వంసం చేయడం తెలిక, నిర్మాణ చేయడం కష్టం అన్న విషయం మర్చిపోరాదని కూడా అన్నారు.
తాను తమిళనాడులో ఉన్నపుడుతానుకూడా వివక్ష అనుభవించానని ఆయన చెప్పారు. పద్నాలుగు సంవత్సరా వయసులో తాను మద్రాసులో పెరుగుతున్నపుడు మైలాపూర్ స్కూల్లో చదువుతన్నపుడు గుల్టె వాడ అని ఆ ప్రాంతాన్ని పిలిచేవారని పవన్ అన్నారు. “ ఈ మాటకు అర్థం చాలా కాలం నాకు తెలియడం లేదు. ఒక రోజు టీచర్ రామనాథన్ గారినిఅడిగాను. ఆయన చెప్పారు అసలు విషయం. గుల్టె అంటే వెనకనుంచి చదవడం. అపుడు గుల్టే అవుతుంది. ఇదొక అవమానకరమయిన పదం. ఎందుకలా అంటున్నారంటే, పెరియార్ అనే పెద్ద మనిషి తెలుగు వాడంట, బలిజ నాయకర్ ఆయన మీద కోపం తో ఇలా అంటున్నారు. రాయలసీమ తిరుపతిలో ఉండిన బలిజనాయుడు కులానికి చెందిన వ్యక్తి పెరియార్. ఆయన ద్రావిడ ఉద్యమరూపకర్త. అందుకని భాష దేముంది? దీని పెట్టుకుని విధ్వంసం చేయడం సరైంది కాదు,” అన్ని ఆయన అన్నారు.
తమిళనాడు హిందీని బాయ్ కాట్ చేయడం సరైంది కాదు. హిందీని బహిష్కరిస్తున్నపుడు తమిళ సినిమాలను హిందీలో ఎందుకు డబ్బింగ్ చేస్తున్నారు. హిందీ లేకపోతే న్యాయం జరగదు అని ఆయన అన్నారు.
భారతదేశానికి బహుభాషా విధానమే రైట్!
భారతదేశానికి బహుభాషా విధానమే రైటని జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన కల్యాణ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపై హిందీని రుద్దుతోందన్న విమర్శలు చెలరేగుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్య చేశారు. మార్చి 14న పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడ వద్ద జరిగిన జనసేన ఆవిర్భావ/విజయకేతన సభను ఉద్దేశించి పవన్ కల్యాణ్ ప్రసంగించారు. తమిళ కవితతో ప్రారంభించి తెలుగు, తమిళం, మరాఠీ, కన్నడ భాషల్లో ప్రేక్షకులకు అభినందలు తెలిపారు. 2024 ఎన్నికల్లో వంద శాతం స్ట్రైకింగ్ రేటుతో జనసేన నిలిచిందని, జీరో నుంచి వంద శాతం గెలుపు సాధించామన్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో దాష్టీక ప్రభుత్వాన్ని దించి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించిన జనసైనికులకు మనసు లోతుల్లోంచి ధన్యవాదాలు చెబుతున్నట్టు తెలిపారు. మహాకవి దాశరధి రాసిన నా తెలంగాణ కోటి రతనాల వీణ అనే గేయాన్ని ప్రస్తావించారు. తన ప్రస్థానం తెలంగాణ నుంచే ప్రారంభమైందన్నారు. తనకు కరెంట్ షాక్ తగిలి చనిపోయే దశకు చేరినపుడు కొండగట్టు ఆంజనేయ స్వామి కాపాడారని గుర్తుచేసుకున్నారు. తన ప్రాణాలను కాపాడిన తెలంగాణ నేలతల్లికి నా వందనాలు, హృదయపూర్వక వందనాలు అన్నారు. తాను గెలిచినా ఓడినా తన వెంట నడిచిన జనసైనికులకి, జనసేన నాయకులకు హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు.
జనసేన వీరమహిళలు తన దృష్టిలో రాణి రుద్రమ్మలన్నారు. జనసేన ప్రేమికులందరికీ తాను రుణపడి ఉంటానని చెప్పారు. ప్రేక్షకులకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు.
రమణ మహర్షి పేరును ప్రస్తావిస్తూ తమిళంలో, చత్రపతి శివాజీ మహారాజ్ పేరును ప్రస్తావిస్తూ మరాఠీలో, కర్ణాటక నుంచి వచ్చిన అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ కన్నడంలో మాట్లాడారు.
భారతదేశానికి బహుభాషా విధానం మంచిదన్నారు. జనసైనికులు 450 మంది సినిమాలు నమ్మి ప్రాణాలు అర్పించలేదని సిద్ధాంతాలను నమ్మి ఇచ్చారన్నారు. "ఈరోజు మీకు డేటా చెప్పను. ఎన్డీఏ ప్రభుత్వం గురించి నిజం చెబుతా. నేను మీతోటి 11 సంవత్సరాలుగా నేను పడ్డ ఇబ్బందులు పంచుకుంటాను. నేను 2014లో ఒక్కణ్ణే కూర్చుని ఆలోచిస్తున్నప్పుడు వచ్చిన ఆలోచనే రాజకీయ పార్టీ. చాలా కసరత్తు చేసిన తర్వాతే రాజకీయాల్లోకి వచ్చా. 2003లోనే నేను మా నాన్నకి చెప్పాను" అని చెప్పారు పవన్ కల్యాణ్.
తాను రాజకీయ పార్టీని పెట్టడానికి స్ఫూర్తినిచ్చిన వ్యక్తులను గుర్తు చేసుకున్నారు. గద్దర్, ఢిల్లీలో ఉండే ప్రొఫెసర్ శ్రీపతి రాముడు, బేతపూడి విజయ్ కుమార్ నిరంతర ప్రోత్సాహంతో పార్టీని ఏర్పాటు చేసినట్టు చెప్పారు.
పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత తన వెన్నంటి ఉన్న జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కి, పాలిటిక్స్ లో లేకపోయినా తానంటే ఇష్టం తోటి ఎప్పుడూ తన వెంట ఉన్న హరిప్రసాద్ కి పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. పార్టీ పటిష్టతకు తోడ్పడిన పంచకర్ల సందీప్ కి పోరాటం చేసిన నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.