ధన్ కడ్ ను ఇప్పుడు పవన్ ఎందుకు పొగిడారు?
x

ధన్ కడ్ ను ఇప్పుడు పవన్ ఎందుకు పొగిడారు?

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ సంచలన కామెంట్స్


ఉప రాష్ట్రపతి జగ్ దీప్ ధన్ కడ్ ఆకస్మిక రాజీనామా వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన వేళ జనసేన అధినేత ,ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయనను ఆకాశానికి ఎత్తేయడం సంచలనంగా మారింది. సాయంత్రం వరకూ సభను నడిపి రాత్రికి రాత్రి సడన్ గా అనారోగ్య కారణాలతో అంటూ పదవికి ధన్ కడ్ రాజీనామా రాజీనామా చేయడం అనేక అనుమానాలకు తావిచ్చింది.ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ అందరి దృష్టిని ఆకర్షించింది.

"ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్ జీ మీరు దేశానికి అంకితభావంతో, విలువైన సేవ చేసినందుకు ధన్యవాదాలు " అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.మీ పదవీకాలం అంతా, మీరు ఉపరాష్ట్రపతి కార్యాలయ గౌరవాన్ని అచంచలమైన నిబద్ధతతో నిలబెట్టారని పవన్ కొనియాడారు. రాజ్యాంగ విలువలను కాపాడుకున్నారని, దయ, నిష్పాక్షికత, సమగ్రతతో పనిచేశారంటూ కితాబిచ్చారు. రాజకీయ ఒత్తిడి లేకుండా మీ నిర్భయమైన అభిప్రాయాల వ్యక్తీకరణ ప్రజా జీవితానికి ఒక ఉన్నత ప్రమాణాన్ని నిర్దేశించిందంటూ ధన్ కడ్ ను మెచ్చుకున్నారు.
ఉపరాష్ట్రపతి పదవి నుంచి తప్పుకుంటున్న వేళ ధన్ కడ్ కు మంచి ఆయురారోగ్యాలు, సంతోషం ఉండాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. అలాగే భవిష్యత్తులో ప్రశాంతమైన జీవితం గడపాలని కోరుకుంటూ ధన్ కడ్ కు పవన్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ధన్ కడ్ రాజీనామా చేసిన వెంటనే పవన్ ఎందుకు స్పందించారన్నది చర్చనీయాంశమౌతోంది. వాస్తవానికి ధన్ కడ్ ఉపరాష్ట్రపతిగా ఉండగా ఏనాడూ ఆయన గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు. బీజేపీ పెద్దల తోనే అభిప్రాయభేదాలు వచ్చి ఉపరాష్ట్రపతి రాజీనామా చేశారని ఒకవైపు చర్చ సాగుతున్న సమయంలో పవన్ ట్వీట్ చేసి హీట్ పుట్టించారు .
Read More
Next Story