పర్యావణ ప్రేమకు అద్దం పట్టిన పవన్ కళ్యాణ్ మాటలు
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యావరణ పరిరక్షణ నిమిత్తం ఎంతగా తపిస్తున్నారో ఆయన మాటలు అందుకు అద్దం పడుతున్నాయి. తన ఇంటినే చిట్టెడవిగా మార్చుకున్నట్లు చెప్పడం విశేషం.
హైదరాబాద్‌లోని 1,400 గజాల ఇంటి స్థలంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కట్టుకున్న ఇంటి చుట్టూ ఉన్న ఆవరణలో చెట్లు పెంచి చిట్టెడవిని తలపించేలా చేశారు. పర్యావరణ పరిరక్షణ ప్రేముకుడిగా చెట్లు పెంచడం అలావాటుగా మార్చుకున్నారు పవన్ కళ్యాణ్. తన ఫామ్ హౌస్‌లోను అన్ని రకాల చెట్లు పెంచారు. వ్యవసాయ పంటలు పండిస్తున్నారు. పశువులు, కోళ్లు పెంచుతున్నారు. అడవిని తలపించేల చెట్ల మధ్యకు రకరకాల పక్షులు వస్తున్నాయి. అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ ప్రకృతిని ఆరాధిస్తూ ఫామ్ హౌస్‌లో తిరుగుతూ గడుపుతారు. హైదరాబాద్‌లోని ఇంటి వద్ద కూడా ఆవరణ చుట్టూ తిరుగుతూ చెట్లు, మొక్కలు వాటి నుంచి వచ్చే సువాసనలు పీల్చుకుంటూ మంచి వాతావారణంలో పెరుగుతున్నాననే ఆనందంతో గడుపుతారు. అటువంటి పవన్ కళ్యాణ్‌కు ప్రభుత్వం అటవీ శాఖను కేటాయించింది.
సోమవారం గ్లోబల్ టైగర్ డే సందర్భంగా మంగళగిరిలోని అరణ్య భవన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్లోబల్ టైగర్స్ డే పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తాను హైదరాబాద్‌లో కట్టుకున్న ఇంటి ఆవరణలో సహజంగా చెట్లు పెరిగే ఏర్పాట్లు చేసుకున్నాను. అదంతా ఇప్పుడు చిన్న అడవిలా తయారైంది. ఇప్పుడు అక్కడకు అప్పుడప్పుడు అరుదైన పక్షులు కనిపిస్తున్నాయి. నాకు ఇది చాలా ఆనందాన్ని కలిగిస్తుందన్నారు.
నల్లమల శివ, చిగుళ్ళ మల్లికార్జునుల మాటలు నన్ను కదిలించాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాన్‌కీ బాత్‌లో పులుల సంరక్షణ గురించి చెబుతూ నల్లమల అడవుల్లోని చెంచులు టైగర్ ట్రాకర్స్‌గా ఉన్నారని, అక్కడ వన్య ప్రాణుల సమాచారం అందించడంతో పాటు అక్రమాలు జరక్కుండా నిఘా ఉంచుతున్నారని చెప్పారు. చెంచుల సంస్కృతిలో పులులు అంతర్భాగమని ప్రధాని చెప్పిన మాటలు స్పూర్తిని కలిగించాయన్నారు. కొన్ని సంవత్సరాల కిందట నల్లమల అటవీ ప్రాంతానికి చెందిన చెంచు జాతి బాలుడు 16 ఏళ్ళ శివ హైదరబాద్‌లోని మా ఆఫీసు వద్దకు వచ్చాడు. అతనితో మాట్లాడినప్పుడు పర్యావరణ పరిరక్షణ మీద చెంచులకున్న నిబద్దత తెలిసింది. అతను తన వద్దకు వచ్చిన పని ఏమిటంటే.. నల్లమలలో యురేనియం మైనింగ్ కోసం ప్రయత్నాలు జరగుతున్నాయి. అదే జరిగితే తమ అడవులు పోతాయి. పులులు చనిపోతాయి. ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు. నల్లమలలో విధ్వసం జరుగుతుంది. నా మాట ఎవరు వింటారో తెలియక మీ వద్దకు వచ్చాను. మీరు ఏమైనా చేయండి అని అడిగాడు. అప్పుడు తాను కాంగ్రెస్ నాయకుడు వి హనుమంతరావుకు చెప్పి నల్లమలలో యురేనియం అన్వేషణపై అఖిల పక్షం సమావేశం ఏర్పాటు చేయించాము. ఆ సమావేశంలో చిగుళ్ళ మల్లికార్జున్ అనే చెంచుల ప్రతినిధి మాట్లాడిన మాటలు తనను కదిలించాయన్నారు. నల్లమల్లలో ఉన్న చెట్లు, జంతువులు, వాగులు, వంకలను మేము దేవతలుగా కొస్తాం. పెద్ద పులి అంటే పెద్దమ్మ దేవర. ఎలుగుబంటిని లింగమయగా చూస్తాం. అడవి పందిని గూబల మస్సి, గారెల మస్సీ, బంగారు మైసమ్మ అని పిలుచుకుంటాం. రేసు కుక్క మల్లికార్జునుడి భార్య గౌరమ్మగా కొలుస్తాం. తేనెలో ఉండే తెల్లగడ్డను నల్లమ్మ అంటామని అక్కడ తమ ఆచార వ్యవహారాలను జీవితాన్ని వివరించారని చెప్పారు పవన్ కళ్యాణ్.
పని చేసిన అధికారులకు గుర్తింపు
శ్రీ బిభూతి భూషణ బంధోపాధ్యాయ రాసిన వనవాసి పుస్తకం చదివినప్పుడు ప్రకృతి ప్రాముఖ్యత అర్థమైంది. ఇప్పుడు తాను దేవుని దయతో ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాను. అంతర్జాతీయ పులుల దినోత్సవాన అధికారులకు మాట ఇస్తున్నాను. ఇక్కడ ఎంతో నిబద్ధత కలిగిన అధికారులు ఉన్నారు. అద్బుతంగా పని చేసిన కొంత మంది అధికారులకు గుర్తింపు రాలేదన్న విషయం తనకు తెలిసిందని, వారికి గుర్తింపు ఇచ్చే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. మీరు చేసిన పని పది మందికి తెలిస్తే అది భవిష్యత్తు తరాలకు స్పూర్తిని ఇస్తుంది. అటవీ అధికారులు అడవుల పరిరక్షణ కోసం ప్రణాళికలు సిద్ధం చేయండి. వాటిని అమలు చేసే బాధ్యత తాను తీసుకుంటానని భరో ఇచ్చారు. ప్రజలకు చేరువయ్యేలా పని చేద్దాం. అవనరమైతే పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్య విధానంలో జూ పార్క్‌ను అభివృద్ధి చేద్దాం. అటవీ శాఖ మంత్రిగా పర్యావరణ ప్రేమిఖుడిగా, పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉంటాం. అంటూ పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం అక్కడి వారిని ఆకట్టుకుంది.
Next Story