Tirumala || తిరుమల శ్రీవారికి దర్శించుకున్న  పవన్ కల్యాణ్ సతీమణి అనా కొణిదెల.
x
Pawan Kalyan's wife Anna Lezhneva

Tirumala || తిరుమల శ్రీవారికి దర్శించుకున్న పవన్ కల్యాణ్ సతీమణి అనా కొణిదెల.

శ్రీవారికి తలనీలాలు సమర్పించారు.


ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భార్య అనా కొణిదెల ఆదివారం తిరుమలకు వెళ్లారు. సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కుమారుడు మార్క్ శంకర్ సురక్షితంగా బయటపడటంతో అనా కొణిదెల స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.



ఈ సందర్భంగా ఆమె శ్రీవారికి తలనీలాలు ఇచ్చారు. ఇటీవల సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్.. స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడిన విషయం తెలిసిందే. దీంతో పవన్ సతీమణి అనా కొణిదెల తిరుమల శ్రీవారిని దర్శనానికి వెళ్లి తలనీలాలు సమర్పించారు.

సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో ఆమె శ్రీవారిని దర్శించుకున్నరు. ఈ మేరకు ఆమె టీటీడీకి డిక్లరేషన్ ఇచ్చారు. టీటీడీ నియమాల ప్రకారం అన్య మతస్థులు తిరుమల వెంకన్న దర్శనానికి వస్తే శ్రీవారిపై నమ్మకం ఉందంటూ తిరుమల తిరుపతి దేవస్థానానికి డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మేరకు అన్నా కొణిదెల గాయత్రి సదనంలో డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేశారు.

ఈరోజు తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.





Read More
Next Story