గుడివాడలో పవన్‌ కల్యాణ్‌ పర్యటన
x

గుడివాడలో పవన్‌ కల్యాణ్‌ పర్యటన

మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్‌సీపీ నేత కొడాలి నాని అడ్డా గుడివాడలో డిప్యూటీసీఎ పవన్‌ కల్యాణ్‌ పర్యటించారు.


ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ కృష్ణా జిల్లా, గుడివాడ నియోజకవర్గం పరిధిలోని మల్లాయపాలెం గ్రామంలో పర్యటించారు. గ్రామీణ రక్షిత మంచినీటి పథకం ద్వారా సరఫరా చేస్తున్న నీటిని పరిశీలించారు. గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో గుడివాడ నియోజకవర్గం పరిధిలోని 44 గ్రామాల్లో రక్షిత మంచినీటి సరఫరరా వ్యవస్థకు మరమ్మత్తులు చేపట్టారు. గ్రామీణ ప్రాంతంలో నీటి సరఫరా సరిగా లేదన్న విషయం పల్లె పండుగ కార్యక్రమంలో పవన్‌ కల్యాణ దృష్టికి గుడివాడ శాసనసభ్యుడు వెనిగండ్ల రాము తీసుకురాగా, రూ. 3.8 కోట్ల నిధులు కేటాయంచారు. యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. ఫిల్టర్‌ బెడ్లు పూర్తిగా దెబ్బ తినడంతో పంచాయతీకి రూ. 4 లక్షల ఖర్చు చేసి ఫిల్టర్‌ బెడ్లు మార్పు చేశారు. 14 గ్రామాల పరిధిలో ఫిల్టర్‌ బెడ్ల మార్పు ప్రక్రియ పూర్తి అయిన క్రమంలో సోమవారం పవన్‌ కల్యాణ్‌ మల్లాయపాలెం రక్షిత మంచి నీటి సరఫరా కేంద్రం వద్ద క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు. స్టోరేజీ ట్యాంక్, ఫిల్టర్‌ బెడ్లతోపాటు 14 గ్రామాల్లో మరమ్మతులకు ముందు, తర్వాత నీటి నమూనాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు వెనిగెండ్ల రాము, మండలి బుద్ధ ప్రసాద్‌ గారు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌ రావి వెంకటేశ్వర రావులు పాల్గొన్నారు.

Read More
Next Story