తమిళనాడు మత్స్యకారులపై పవన్‌ కల్యాణ్‌ ట్వీట్‌
x

తమిళనాడు మత్స్యకారులపై పవన్‌ కల్యాణ్‌ ట్వీట్‌

స్నేహపూరితంగా ఇరు దేశాలు సమస్యలను పరిష్కరించుకోవాలని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.


తమిళనాడు మత్స్యకారుల మీద ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. తమిళనాడుకు చెందిన 24 మంది మత్స్యకారులకు సంబంధించి బంగాళఖాతంలో ఇటీవల జరిగిన సంఘటనలు, పరస్పర దాడులు తనకు తీవ్ర ఆందోళనలు కలిగిస్తున్నాయని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. ఆ మేరకు ఆయన సోమవారం ఓ ట్వీట్‌ చేశారు.

పవన్‌ కల్యాణ్‌ ఏమన్నారంటే..
బంగాళఖాతం సముద్రంలో జరిగిన ఘర్షణల కారణంగా నాగపట్నం జిల్లాకు చెందిన తమిళనాడు మత్స్యకారులు గాయపడ్డారని, దీంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారనే విషయాలు తెలిసిన తర్వాత తనకు చాలా బాధనిపించందన్నారు. భారతదేశం, శ్రీలంకల మధ్య సుదీర్ఘ కాలంగా స్నేహపూరిత సంబంధాలు ఉన్నాయి. అవి నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పునరావృతమయ్యే మత్స్యకారుల సంఘటనలను దృష్టిలో ఉంచుకొని, ఇవి మళ్లీ మళ్లీ పునరావృతం కాకుండా శాశ్వత ప్రాతిపదకన ఈ సమస్యలను పరిష్కరించుకునే దిశగా విదేశాంగ శాఖ చర్యలు చేపట్టాలని, ఆ మేరకు విదేశాంగ శాఖను తాను కోరుతున్నట్లు ట్వీటర్‌ వేదికగా పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.
భారత దేశం, శ్రీలంక ప్రభుత్వాలు రెండు కూడా పరస్పర స్నేహపూరిత వాతావరణంలోను ఇరువురు సహకార స్పూర్తితోను మత్స్యకారుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించుకోవాలని, ఆ దిశగా రెండు దేశాలు నిర్మాణాత్మక చర్యలు చేపట్టాలని, ఇది అత్యవసరమని తాను భావిస్తున్నట్లు పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. రెండు దేశాల ప్రభుత్వాలు మత్స్యకారుల భద్రతను, గౌరవాన్ని నిలబెట్టేందుకు భారతదేశం, శ్రీలంక ప్రభుత్వాలు నిరంతరం ప్రయత్నాలు చేయాలని పవన్‌ కల్యాణ్‌ విజ్ఞప్తి చేశారు.
Read More
Next Story