జగన్‌ ‘రఫ్పా రఫ్పా’పై పవన్‌ కల్యాణ్‌ రియాక్షన్‌
x

జగన్‌ ‘రఫ్పా రఫ్పా’పై పవన్‌ కల్యాణ్‌ రియాక్షన్‌

అశాంతిని కలుగజేసే అసాంఘిక శక్తులకు మద్ధతు పలికే విధంగా మాట్లాడటం కూడా నేరమే అవుతుందని పవన్‌ కల్యాణ్‌ హెచ్చరించారు.


మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం చేసిన ‘రఫ్పా రఫ్పా’ వ్యాఖ్యల మీద ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ రియాక్ట్‌ అయ్యారు. రఫ్పా రఫ్పా అనేది సినిమా డైలాగు కావడం, దానిని జగన్‌ ప్రస్తావించడం, దీనిపైన సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తి, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ స్పందించడం అనేది ఆసక్తికరంగా మారింది.

జగన్‌ రఫ్పా రఫా అని మాట్లాడటంపైన పవన్‌ కల్యాణ్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు అంశాతిని, అభద్రతలను కలుగజేస్తాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అంశాతిని, అభద్రతను కలిగించే వారికి మద్ధతు పలకడం, అప్రజాస్వామిక ధోరణిలో మాట్టాడం మంచిది కాదని, ఇలా మాట్లడుతున్న వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇలాంటి వారిని ఓ కంట కనిపెట్టి ఉండాలన్నారు. చట్ట విరుద్ధంగా వ్యాఖ్యలు చేయడం, చట్ట విరుద్ధంగా ప్రదర్శనలు చేసే వారిన కట్టడి చేయాల్సింది పోయి.. వారిని సమర్థించే విధంగా జగన్‌ మాట్లాడటం అనేది వారి నేర ప్రవృత్తిని, నేరమయ ఆలోచనలు తెలియజేసివిగా ఉన్నాయని, వీటిని ప్రజలంతా గమనించాని కోరారు.
శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అసాంఘిక శక్తులకు మద్ధతు తెలుపుతూ మాట్లాడటం అనేది కూడా నేరమే అవుతుని, ఈ విషయాన్ని మరిచి పోవద్దని జగన్‌ను పవన్‌ కల్యాణ్‌ హెచ్చరించారు. సినిమాల్లో చెప్పే డైలాగులు సినిమాలు, సినిమా హాళ్ల వరకే బాగుంటాయని, వాటిని అంతటితో వదలేయాలని, వాటిని సమాజంలోను, ప్రజాస్వామ్యంలోను ఆచరణలో పెట్టడం అనేది సాధ్యపడదని, ఎవరు ఏ స్థాయిలో ఉన్నా చట్టాన్ని గౌరవించాల్సిందేనని అమరావతిలో మాట్లాడుతూ పవన్‌ కల్యాణ్‌ సూచించారు.
Read More
Next Story