
దుర్గమ్మను దర్శించుకున్న పవన్ కల్యాణ్
మంత్రి ఆనంతో పాటు ఆలయ అధికారులు పవన్ కల్యాణ్‌కు ఘన స్వాగతం పలికారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ వారిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సోమవారం సాయంత్రం దర్శించుకున్నారు. పవన్ కళ్యాణ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి, ఆలయ ఈవో, వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఉప ముఖ్యమంత్రితోపాటు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించారు. సోమవారం నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 11 రోజుల పాటు దసర ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఒక్కో రోజు ఒక్కో అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా భారీగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉంది. ఆ మేరకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేపట్టారు.
Next Story