ఆర్‌ఎస్‌ఎస్‌ను పొగడ్తలతో ముంచెత్తిన పవన్‌ కల్యాణ్‌
x

ఆర్‌ఎస్‌ఎస్‌ను పొగడ్తలతో ముంచెత్తిన పవన్‌ కల్యాణ్‌

ఆర్‌ఎస్‌ఎస్‌ శతాబ్ది ఉత్సవం సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ శుభాకాంక్షలు తెలిపారు.


రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) స్థాపన శతాబ్ది సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. క్రమశిక్షణ, అంకితభావం, దేశ సేవలో ఆర్‌ఎస్‌ఎస్‌ గొప్ప సంస్థగా నిలిచిందని ఆయన కొనియాడారు. పవిత్రమైన విజయదశమి రోజున సంఘ్‌ వంద సంవత్సరాలు పూర్తి చేసుకోవడం గొప్ప విషయమని పవన్‌ అన్నారు.

‘స్వాతంత్య్ర ఉద్యమం నుంచి ప్రకృతి వైపరీత్యాలు, సంక్షోభ సమయాల్లో సహాయం అందించడంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ఎల్లప్పుడూ ముందుండి నడిచింది. సంఘ్‌ బలం మాటల్లో కాదు, చేతల్లో ఉంది. అంకితభావంతో సేవ చేయడంలో ఆర్‌ఎస్‌ఎస్‌ శతాబ్ది పూర్తి చేసుకుంది. ప్రతి స్వయంసేవకుడిలో సేవా లక్షణం కనిపిస్తుంది. ఈ చారిత్రాత్మక శతాబ్ది సందర్భంగా ప్రతి స్వయంసేవకుడికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు,‘ అని పవన్‌ కల్యాణ్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌సంఘచాలక్‌ మోహన్‌ భగవత్‌ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ, ‘15 సంవత్సరాలకు పైగా సంఘానికి నాయకత్వం వహిస్తున్న మోహన్‌ భగవత్‌ గారికి నా కృతజ్ఞతలు. సనాతన ధర్మ విలువలతో సమాజాన్ని ఏకం చేయడంలో ఆయన అచంచలమైన నిబద్ధతను చూపారు. ఆయన నాయకత్వం లక్షలాది మందికి స్ఫూర్తినిస్తూ, దేశవ్యాప్తంగా సేవా స్ఫూర్తిని బలోపేతం చేస్తోంది,‘ అని పవన్‌ కొనియాడారు.
1925లో డాక్టర్‌ కేశవ్‌ బలిరామ్‌ హెడ్గేవార్‌ చేత స్థాపించబడిన ఆర్‌ఎస్‌ఎస్, జాతీయవాదం, సామాజిక సేవ, సాంçస్కృతిక సంరక్షణలో కీలక పాత్ర పోషించింది. ఈ శతాబ్ది వేడుకలు దేశవ్యాప్తంగా స్వయంసేవకులకు ఉత్సాహాన్ని అందిస్తున్నాయి. రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) శతాబ్ది ఉత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రమశిక్షణ, అంకితభావంతో దేశ సేవలో నిమగ్నమైన ఆర్‌ఎస్‌ఎస్‌ గొప్ప సంస్థ అని ఆయన కొనియాడారు. విజయదశమి రోజున శతాబ్ది పూర్తి చేసుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు.

Read More
Next Story