మధుసూదన్‌ భౌతికకాయానికి పవన్‌ కల్యాణ్‌ నివాళి
x

మధుసూదన్‌ భౌతికకాయానికి పవన్‌ కల్యాణ్‌ నివాళి

రేపు వైజాగ్‌ వెళ్లి చంద్రమౌళి కుటుంబాన్ని పరామర్శించనున్నట్లు పవన్‌ కల్యాణ్‌ తెలిపారు.


కశ్మీర్‌ ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ సోమిశెట్టి మధుసూదన్‌ భౌతికకాయానికి ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ నివాళులు అర్పించారు. జమ్ముకశ్మీర్‌ పహల్గాంలో మంగళవారం ఉగ్ర దాడిలో మధుసూదన్‌ది నెల్లూరు జిల్లా కావలి. మధుసూదన్‌ పార్దివ మృతదేహాన్ని ఘటన స్థలం నుంచి చెన్నైకి తరలించారు. గురువారం తెల్లవారుజామున చెన్నై నుంచి మధుసూదన్‌ స్వస్థలమైన కావలికి తీసుకొచ్చారు.

గురువారం కావలికి చేరుకున్న పవన్‌ కల్యాణ్‌ మంత్రులు నాదెండ్ల మనోహర్, ఆనం, సత్యకుమార్, ఎమ్మెల్యేలు కావ్యా కృష్ణారెడ్డి, సోమిరెడ్డితో ఆర్‌ఎస్‌ఎస్‌ జాతీయ నాయకుడు మధుకర్‌లతో కలిసి నేరుగా మధుసూదన్‌ ఇంటికెళ్లి ఆయన పార్దివ మృతదేహానికి నివాళులు అర్పించారు. అనంతరం పవన్‌ కల్యాణ్‌ మధుసూదన్‌ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఉగ్ర దాడిలో కొడుకుని పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్న మధుసూదన్‌ తల్లిదండ్రులను ఓదార్చడం పవన్‌ కల్యాణ్‌ వంతు కాలేదు. గుండెలు బాధుకుంటూ విలపిస్తున్న వారిని చూసి పవన్‌ కల్యాణ్‌సైతం ఆవేదనకు గురయ్యారు. మధుసూదన్‌ మరణించాడనే విషయాన్ని జీర్ణించుకోలేని స్థితులో కుటుంబ సభ్యులు ఉన్నారు. దుర్ఘటన గురించి పవన్‌ కల్యాణ్‌ అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం బాధిత కుటుంబానికి అండగా ఉంటుందని ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు పవన్‌ కల్యాణ్‌ హామీ ఇచ్చారు.
రేపు పవన్‌ కల్యాణ్‌ వైజాగ్‌ వెళ్లనున్నారు. ఉగ్ర దాడిలో మరణించిన చంద్రమౌళి కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత మంగళగిరిలో ప్రెస్‌ మీట్‌ ఏర్పాటు చేయనున్నారు. ఉగ్ర వాదుల దాడులు, ప్రాణాలు తీసిన తీరును ఆయన వివరించాలని భావిస్తున్నారు. సమ్మర్‌లో షూటింగ్‌ల కోసం అక్కడకు అనేక సార్లు వెళ్లానని, అక్కడి వాతావరణం, అక్కడ పరిస్థితులు తనకు తెలుసన్నారు. ఉగ్ర మూకలు ఎక్కడున్నా కనికరం లేకుండా వారిని ఏరిపారేయాలని అన్నారు.
కావలికి చెందిన సోమిశెట్టి మధుసూదన్‌ సాప్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా బెంగుళూరులో స్థిరపడ్డారు. అక్కడే ఓ ఇల్లును సమకూర్చుకునే కుటుంబంతో కలిసి బెంగుళూరులోనే నివాసం ఉంటున్నారు. తన భార్య, పిల్లలతో కలిసి మధుసూదన్‌ కశ్మీర్‌లోని పహల్గాంకు విహార యాత్రకు వెళ్లారు. ఏప్రిల్‌ 22 మంగళవారం జరిగిన ఉగ్ర దాడిలో మధుసూదన్‌ ప్రాణాలు కోల్పోయాడు. చంపొద్దని ఎంత వేడుకున్నా కనికరించని ఉగ్ర మూకలు మధుసూదన్‌ను పొట్టన పెట్టుకున్నారు. గురువారం తెల్లవారుజామున ఆయన మృతదేహాన్ని కావలికి తరలించారు.
Read More
Next Story