నెంబర్ వన్ పొలిటిషన్‌గా పవన్ కల్యాణ్.. యూటర్న్ తీసుకున్న వంగ గత
x

నెంబర్ వన్ పొలిటిషన్‌గా పవన్ కల్యాణ్.. యూటర్న్ తీసుకున్న వంగ గత

దేశంలో నెంబర్ వన్ పొలిటిషన్‌గా మోదీని వెనక్కు నెట్టి పవన్ కల్యాణ్ మారారని ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో వంగా గీత యూటర్న్ తీసుకున్నారు. అసలు పిఠాపురం రాజకీయ పరిస్థితి ఎలా ఉంది..


కౌంటింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆంధ్ర రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో అంచనా వేయడం కూడా వృధా ప్రయాసలా మారుతోంది. ఈక్రమంలోనే అలాంటి మలుపే ఒకటి తిరిగినట్లు ప్రచారం జరుగుతోంది. భారతదేశంలోనే అత్యంత పాపులర్ పొలిటిషన్‌గా జనసేనాని పవన్ కల్యాణ్ నిలిచారని ఉధృతంగా ప్రచారం జరుగుతోంది. ఇన్నాళ్లూ ఈ కేటగిరిలో టాప్‌లో ఉన్న ప్రధాని మోదీ.. ఒక్కసారి రెండో స్థానానికి పడిపోయారు. ఈ ప్రచారం ప్రకారం.. తొలి స్థానంలో పవన్ కల్యాణ్, రెండో స్థానంలో ప్రధాని మోదీ, మూడో స్థానంలో రాహుల్ గాంధీ ఉన్నారు.

ఈ క్రమంలోనే పవన్ అభిమానులు, జనసేన శ్రేణుల ఆనందానికి అవధులు లేకుండా పోతోంది. పవన్ స్థాయి అందంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌లపైన పోస్ట్‌లు కురిపిస్తున్నారు. ఇందులో భాగంగానే పిఠాపురంలో పవన్‌పై పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి వంగా గీతను, ఆమెకు మద్దతుగా, పవన్ ఓటమే ధ్యేయంగా ప్రచారం చేసిన ముద్రగడ పద్మనాభం టార్గెట్‌గా కూడా పోస్ట్‌లు పెడుతున్నారు. దీంతో ఆంధ్రలో పిఠాపురం నియోజకవర్గం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే వంగా గీత యూటర్న్ తీసుకున్నారంటూ ఓ ఆడియో క్లిప్ కూడా వైరల్ అవుతోంది. అందులో తనకు మెగా ఫ్యామిలీ అంటే ఎంతో అభిమానం అని, అందుకే తాను ఎప్పుడూ కూడా పవన్‌ను వ్యక్తిగతంగా దూషించలేదని వంగా గీత వివరిస్తున్నారు.

వంగా గీత ఏమన్నారంటే!

‘‘పిఠాపురం ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌కు వ్యతిరేకంగా నేను ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. నేను చేసిన ప్రచారాన్ని గమనిస్తే ఎక్కడా కూడా పవన్‌ను వ్యక్తిగతంగా విమర్శించలేదు. నా చుట్టూ ఉన్నవాళ్లు ఎంత చెప్పినా ఆ విషయంలో మాత్రం ససేమిరా అని చెప్పేశారు. కొందరు పవన్‌పై విమర్శలు చేసినా నేను ఆపాను. మెగాస్టార్ చిరంజీవి కుటుంబంపై నాకున్న గౌరవం వల్లే నేను వ్యక్తిగత దాడికి దిగలేదు’’ అని వివరించారామే.

‘ఓటమి భయంతోనే ఈ మాటలు’

కౌంటింగ్ దగ్గర పడుతుండటంతో వంగా గీతలో ఓటమి భయం పెరిగిపోయిందని, అందుకే ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారంటూ జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ రోజున పిఠాపురం పోలింగ్ కేంద్రాల్లో ఎదురైన అనుభవాలను బేరీజు వేసుకునే తన ఓటమి ఖాయమన్న నిర్ణయానికి వంగా గీత వచ్చారని, ఇన్ని రోజులు బాగా ఆలోచించుకుని ఇప్పుడు ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించేశారంటూ వ్యంగ్యాస్త్రాలు కూడా సంధించారు. అనంతరం నామకరణ ఉత్సవానికి సిద్ధం కావాలంటూ ముద్రగడ పద్మనాభానికి కూడా పొగ పెడుతున్నారు జనసైనికులు.

ఇప్పుడు అదే ఇంపార్టెంట్

పిఠాపురంలో కూడా రాష్ట్ర సీఎం ఎవరవుతారు? రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉంటుంది? అన్న అంశాలకన్నా పిఠాపురం ఎమ్మెల్యే ఎవరవుతారు అన్న దానిపైనే చర్చలు భారీగా జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా ఇదే చర్చ కనిపిస్తోంది. కొందరు వంగా గీత వస్తుందంటే.. పోలింగ్ రోజున చూశారుగా మళ్లీ అడగాలా వచ్చేది జనసేనాని పవన్ కల్యాణ్.. అందులో డౌట్ లేదు అంటూ మరికొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ ముందు వరకే కాదు.. పోలింగ్ ముగిసిన తర్వాత కూడా పిఠాపురంలో ఎవరు గెలుస్తారు అన్న అంశం మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది.

Read More
Next Story