సీఎం చంద్రబాబుకు స్పెషల్ థాంక్స్  చెప్పిన పవన్
x

సీఎం చంద్రబాబుకు స్పెషల్ థాంక్స్ చెప్పిన పవన్

అటవీ అమరవీరుల కుటుంబాల సంక్షేమం కోసం రూ. 5 కోట్ల సంక్షేమ నిధిని జమ చేసిన కూటమి ప్రభుత్వం


ఆంధ్రప్రదేశ్‌లో అటవీ అమరవీరుల కుటుంబాల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు వారి సంక్షేమ నిధికి రూ. 5 కోట్లను జమ చేసినట్టు వెల్లడించారు.ఇందుకు గాను సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పవన్ కల్యాణ్ స్పందించారు.

"అడవులను, వన్యప్రాణులను కాపాడే క్రమంలో తమ ప్రాణాలను అర్పించినవారిని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. వారి ధైర్య సాహసాలను స్మరించడం మనందరి బాధ్యత. వారి త్యాగం రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకం" అంటూ పవన్ నివాళులు అర్పించారు.
అడవులు మన జాతి సంపద. వాటిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్న పవన్ కల్యాణ్ ,అమరవీరులైన అటవీ అధికారుల కుటుంబాల సంక్షేమం కోసం సహకరించిన చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని తెలిపారు.అటవీ రక్షకుల భద్రత కోసం ఆధునిక ఆయుధాలు, రక్షణ సామాగ్రి, కమ్యూనికేషన్ సదుపాయాలు, వాహనాలను అందించడంతోపాటు, అత్యవసర పరిస్థితుల్లో స్వీయరక్షణ, అక్రమ కార్యకలాపాలను ఎదుర్కోవడం, సవాళ్లను అధిగమించేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.అటవీ సంరకషణ కోసం తమ ప్రభుత్వం కట్టబడి వుందన్నారు.
Read More
Next Story