పవన్‌ అన్నా మెగా డీఎస్సీకి రావాలి..ప్లీజ్
x

పవన్‌ అన్నా మెగా డీఎస్సీకి రావాలి..ప్లీజ్

జీఎస్టీ సంస్కరణల వల్ల కలిగే లాభాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని క్యాబినెట్‌ సబ్‌కమిటీ నిర్ణయం తీసుకుంది.


ఉప ముఖ్మమంత్రి వపన్‌ కల్యాణ్‌తో మంత్రి నారా లోకేష్‌ సోమవారం అసెంబ్లీలో భేటీ అయ్యారు. ప్రత్యేకంగా ఇరువురు భేటీ కావడంపైన ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా ఇరువురు పలు అంశాలపై చర్చించుకున్నారు. త్వరలో సెప్టెంబరు 25న నిర్వహించనున్న మెగా డీఎస్సీ–2025 కార్యక్రమానికి హాజరు కావాలని స్వయంగా వెళ్లి, కలిసి డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను మంత్రి లోకేష్‌ ఆహ్వానించారు. డీఎస్సీ లో అర్హత సాధించిన అభ్యర్థులందరికీ నియామక పత్రాలను పంపిణీ చేయనున్నా ఈ కార్యక్రమానికి తప్పకుండా హాజరు కావాలని పవన్‌ కల్యాణ్‌ను మంత్రి లోకేష్‌ కోరినట్లు తెలిసింది.

పోయిన శుక్రవారం అంటే సెప్టెంబరు 19న ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని భావించారు. అమరావతిలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనే ఉద్దేశంతో అసెంబ్లీకి వెనుక భాగంలో ఉన్న ప్రదేశంలో ఏర్పాట్లు కూడా చేపట్టారు. గుంటూరు జిల్లా కల్టెక్లర్, ఎస్సీలు కూడా వెళ్లి ఏర్పాట్లను పరిశీలించారు. అయితే వర్షాల కారణంగా ఆ ప్రాంతం అంతా తడిసి ముద్ద కావడం, ప్రాంగణమంతా బురదమయం కావడంతో ఆ కార్యక్రమాన్ని వాయిదా వేశారు.
మరో వైపు జీఎస్టీ రీఫామ్స్‌పై అసెంబ్లీలోని మంత్రి నారా లోకేష్‌ ఛాంబర్‌లో క్యాబినెట్‌ సబ్‌కమిటీ సోమవారం భేటీ అయ్యింది. లోకేష్‌ నేతృత్వంలో మంత్రులు పయ్యావుల కేశవ్, వంగలపూడి అనిత, కందుల దుర్గేష్, సత్యకుమార్‌ యాదవ్‌లు ఈ భేటీలో పాల్గొన్నారు. జీఎస్టీ సంస్కరణలు నేపథ్యంలో ఇవి ఆంధ్రప్రదేశ్‌లో అమలులోకి వచ్చిన క్రమంలో వీటి వల్ల కలిగే లాభ, నష్టాలపై మంత్రులు చర్చించారు. నిత్యవసర వస్తువుల ధరలు తగ్గి సామాన్య ప్రజలకు కలుగుతున్న మేలును ప్రజల్లో బలంగా తీసుకెళ్లాలని, అలా ప్రజల్లో తీసుకెళ్లేందుకు అవసరమైన కార్యాచరణను కూడా రూపొందించాలని క్యాబినెట్‌ సబ్‌కమిటీ నిర్ణయం తీసుకుంది. జీఎస్టీ సంస్కరణలు, వాటి వల్ల కలిగే లాభాలు వంటి అంశాలపైన ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిర<యానికి వచ్చినట్లు తెలిసింది.
Read More
Next Story