BUSES BURNED | అనంత లో ప్రయాణికులకు తప్పిన  ప్రమాదం
x

BUSES BURNED | అనంత' లో ప్రయాణికులకు తప్పిన ప్రమాదం

ఆర్టీసీ బస్టాండ్ వద్ద రెండు బస్సులు దగ్ధమయ్యాయి. మాజీ మంత్రి జెసి బ్రదర్స్ ప్రయివేటు బస్సులు.


నిలిపి ఉన్న బస్సులకు నిప్పు అంటుంది. కళ్లెదుటే అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. సమీపంలో ప్రయాణికులు లేకపోవడంతో భారీ ప్రాణనష్టం తప్పింది. ఆ రెండు ప్రైవేటు బస్సులు నిత్యం వార్తలలో నిలిచే జేసి బ్రదర్స్ కు చెందినవి కావడం గమనార్హం.

అనంతపురం ఆర్టీసీ బస్టాండు సమీపంలో భారీ ప్రమాదం తప్పింది. బుధవారం అర్ధరాత్రి తర్వాత ఈ సంఘటన జరగడం వల్ల ప్రాణా నష్టం కూడా తప్పినట్టు భావిస్తున్నారు. రెండు బస్సులు దగ్ధమవుతున్న సమాచారం అందుకున్న అగ్నిమాపక వాహనంతో వచ్చిన సిబ్బంది ఎగసిపడుతున్న అగ్నికీలలను అదుపు చేశారు.
అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన మాజీమంత్రి జెసి దివాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి ప్రైవేటు బస్సులు నడుపుతున్న విషయం తెలిసిందే. జేసీ ట్రావెల్స్ పేరిట అనంతపురం, కర్ణాటక రాష్ట్రాల్లోని వివిధ రూట్లో బస్సులు నడుపుతున్నారు. కాగా,
అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో నిలిపి ఉన్న జెసి బ్రదర్స్ బస్సులు దగ్ధమయ్యాయి. బస్సులు నిలిపిన ప్రదేశానికి పై భాగంలో ఉన్న 11 కె.వి విద్యుత్ వైర్ తెగిపడడం వల్లే పడిన నిప్పురవ్వల వల్ల మంటలు చెలరేగాయని చెబుతున్నారు. ఆ సమయంలో నిలిపి ఉన్న బస్సుల వద్ద సిబ్బంది తోపాటు ప్రయాణికులు ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణ నష్టం జరగలేదని సమాచారం అందింది. ప్రైవేటు బస్సులు నిర్వహణలో జేసీ బ్రదర్స్ కీలకంగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం సంఘటన జరిగిన ప్రదేశంలోనే నిలిపిన బస్సులకు ఆకస్మికంగా నిప్పు అంటుకోవడం పై వివిధ రకాల మాటలు వినిపిస్తున్నాయి. రెండు బస్సులు దగ్ధం కావడానికి దారి తీసిన పరిస్థితి ఏమిటి? అనేది విచారణలో తేలే అవకాశం ఉంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read More
Next Story