పార్వతీపురం అత్యంత సమస్యాత్మకం
మన్యం జిల్లాలో నాలుగు గంటలకు పోలింగ్ ముగిసింది. అయినా పోలింగ్ శాతం తగ్గలేదు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లాను అత్యంత సమస్యాత్మకమైన జిల్లాగా ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ జిల్లాలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరిగింది. జిల్లా వ్యాప్తంగా పోలింగ్ 61.18 శాతం నమోదైంది. అల్లూరి సీతారామరాజు జిల్లాను మించి పోలింగ్ నమోదు కావడం విశేషం. మావోయిస్టుల ప్రభావం ఉన్న జిల్లాగా ప్రభుత్వం గురించినందున అత్యంత సమస్యాత్మకమైన జిల్లాల్లో ఒకటిగా తీసుకుంది. ఈ జిల్లా పూర్తిగా ఏజెన్సీ ప్రాంతంలో ఉంది. ఆంధ్ర, ఒరిస్సా బార్డర్‌లో ఉన్నందున ఎన్నికల అధికారులు కూడా ఒకరోజు ఇక్కడికి ముందుగా చేరుకోవాల్సి వచ్చింది. ఇక్కడ కూడా అడవుల్లో సరైన రహదారులు లేకపోయినా గిరిజనులు నడుచుకుంటూ పోలింగ్ కేంద్రాలకు చేరుకొని ఓట్లు వేశారు.
Next Story