
పరకామణి చోరీ కేసులో హైకోర్టుకు సీఐడీ నివేదిక
ఈ కేసు పూర్వపరాలు, రాజీ ప్రక్రియ, దాని వెనుక పరిస్థితులపై సీఐడీ మంగళవారం అదనపు నివేదికను హైకోర్టుకు సమర్పించింది.
పరకామణి చోరీ కేసులో నిందితుడు రవికుమార్ పై లోక్ అదాలత్ లో జరిగిన రాజీ చట్టబద్ధతపై హైకోర్టు కీలక విచారణ చేపట్టింది. ఈ కేసు పూర్వపరాలు, రాజీ ప్రక్రియ, దాని వెనుక పరిస్థితులపై సీఐడీ మంగళవారం అదనపు నివేదికను హైకోర్టుకు సమర్పించింది.
ఈ కేసులో రవికుమార్ తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పరకామణి లెక్కింపు విభాగంలో పనిచేస్తూ విదేశీ కరెన్సీ చోరీ చేస్తున్న సమయంలో అడ్డంగా పట్టుబడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అతనిపై నమోదు చేసిన క్రిమినల్ కేసు తరువాత లోక్ అదాలత్‌లో రాజీ కుదిరినట్టుగా రికార్డులు చూపించాయి. అయితే చోరీ వంటి నేరంలో లోక్ అదాలత్ రాజీ అనుమతించదగినదా అన్న ప్రశ్నలతో ఈ రాజీని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
తాజా విచారణలో, సీఐడీ సమర్పించిన నివేదికతో పాటు మరిన్ని రెండు సెట్ పత్రాలను సీల్డ్ కవర్‌లో రిజిస్ట్రార్‌కు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. రాజీ ప్రక్రియలో ఏ నిబందనలు అనుసరించబడ్డాయి? అది చట్టబద్ధమా? అనే అంశాలను కోర్టు ఈ పత్రాల ఆధారంగా పరిశీలించనుంది.
లోక్ అదాలత్‌లో చోరీ వంటి కేసులు రాజీ పరిధిలోకి వస్తాయా? పరకామణి వంటి దేవాలయ ఆస్తులు 'వ్యక్తిగత వివాదం' కింద పరిగణించాలా? అన్న ప్రశ్నలపై హైకోర్టు తుది నిర్ణయం తీసుకోనుంది.
విచారణను బుధవారానికి వాయిదా వేసింది.
సీఐడీ నివేదికలో, రవికుమార్ విదేశీ కరెన్సీని చోరీ చేస్తూ అడ్డంగా పట్టుబడిన కేసు లోక్ అదాలత్‌లో రాజీ చేసుకున్న అంశంపై వివరాలు ఇమిడి ఉన్నాయి. అయితే కేసులో కీలకమైన రెండు సెట్‌లు ఉన్న పత్రాలను సీల్డ్ కవర్‌లో రిజిస్ట్రార్‌కు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.
ఈ నివేదిక ఆధారంగా లోక్ అదాలత్‌లో రాజీకి చట్టబద్ధత ఉన్నదా? లేక లేదా? అన్న అంశాన్ని హైకోర్టు పరిశీలించనుంది. చోరీ వంటి నేరాల్లో రాజీ ప్రక్రియ అనుమతించదగినదేమిటన్న ప్రశ్నపై న్యాయపరంగా స్పష్టత వచ్చే అవకాశం ఉందని న్యాయవర్గాలు భావిస్తున్నాయి.
విచారణను బుధవారానికి వాయిదా వేస్తూ, సీల్డ్ కవర్ పత్రాలు సమర్పించిన తర్వాత తదుపరి చర్యలు నిర్ణయిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది.
లోక్ అదాలత్ వద్ద రాజీ వ్యవహారం చట్టబద్ధతపై ఇప్పటికే హైకోర్టులో కేసు కొనసాగుతోంది.
Next Story

